కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టనున్న మహేష్-పవన్ కళ్యాణ్...!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబుల సినిమాలొస్తున్నాయంటే ఆంధ్రా అంతటా ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో అది ఎంతటి క్రేజి ప్రాజెక్ట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారి సినిమాలకు ఉన్న డిమాండ్ అలాంటిది. వారికున్న అభిమానులు లక్షలు. అలాంటిది వారిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనబడితే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించటం కూడా కష్టం. అసలు ఇలాంటి ప్రాజెక్ట్ జరుగుతుందా అనే సందేహం కూడా చాలా మందికి కలుగుతుంది. ఇది త్వరలో సాధ్యం అయేట్టు అనిపిస్తుంది. ఓ ప్రముఖ నిర్మాత అందుకు తగిన సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. పవన్ కళ్యాణ్, మహేష్ ల మధ్య మంచి స్నేహం ఉంది. ఈ స్నేహంతోనే జల్సా సినిమాలో మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సరిపడ కథ దొరికితే కలిసి నటించడానికి తమకేం అభ్యంతరం లేదంటున్నారు పవన్, మహేష్ లు. మరి ఇదే కనుక నిజమైతే టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు...


Click it and Unblock the Notifications











