twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోలతో గొడవల గురించి పవన్ క్లారిటీ,నేర్చుకోవాల్సిన పాఠం ఇదే

    By Srikanya
    |

    తిరుపతి: కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో ఇద్దరు సినిమా హీరోల అభిమానుల మధ్య రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణ జరిగింది. అందులో కత్తిపోట్లకు గురైన వినోద్ అనే పవన్ కల్యాణ్ వీరాభిమాని మరణించిన సంగతి తెలిసిందే.కర్ణాటకలో హత్యకు గురైన తన అభిమాని వినోద్‌ రాయల్‌ కుటుంబాన్ని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఈరోజు పరామర్శించారు.

    హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుపతికి చేరుకున్నారు. వినోద్‌ కుటుంబసభ్యులను పరామర్శించి ఘటన వివరాలను తెలుసుకున్నారు. కన్నీటి పర్యంతమైన వినోద్‌ కుటుంబసభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

    కర్ణాటకలో మూడు రోజుల క్రితం వినోద్‌ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కోలారులో జరిగిన ఓ కార్యక్రమంలో జరిగిన ఘర్షణలో వేరే హీరో అభిమాని.. వినోద్‌ను కత్తితో పొడిచాడు. తీవ్ర రక్తస్రావమైన వినోద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తన అభిమాని హత్య విషయం తెలుసుకున్న పవన్‌కల్యాణ్‌ ఈరోజు తిరుపతికి చేరుకుని అతడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా పవన్ మీడియాతో మాట్లాడారు.

    పవన్ మాట్లాడుతూ...సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వినోద్‌ మృతి తనను తీవ్రంగా బాధించిందని పవన్‌కల్యాణ్‌ అన్నారు. వినోద్‌ కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

    పవన్ ఇంకేం అన్నారు అనే విషయాలు స్లైడ్ షోలో చదవండి

    సరికాదు

    సరికాదు

    హీరోలపై అభిమానం ఉండటంలో తప్పులేదని.. కానీ క్షణికావేశంలో ఇలాంటి ఘటనలకు పాల్పడటం సరికాదన్నారు.

    సూచన

    సూచన

    అభిమానులు మితిమీరిన స్థాయికి వెళ్లి గొడవ పడి ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు.

    ఆవేదన

    ఆవేదన

    మరో రెండు నెలల్లో అమెరికా వెళ్లాల్సిన యువకుడు విగతజీవిగా మారడం తల్లిదండ్రులకు తీరని శోకంగా మారిందని పవన్‌కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

    శిక్షించాల్సిందే

    శిక్షించాల్సిందే

    వినోద్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

    అండగా ఉంటా

    అండగా ఉంటా

    అండగా ఉంటానుకుంటుంబానికి అండగా ఉంటానని ఈ విషయంలో ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడతానని అన్నారు.

    ప్రభుత్వందే భాధ్యత

    ప్రభుత్వందే భాధ్యత

    ఇదే సమయంలో ఈ ఘటనపై విచారణ బాద్యత పూర్తిగా రాష్ట్రప్రభుత్వానిదని - ఒకవేల రాష్ట్రప్రభుత్వం గనుక ఈ విషయంలో విఫలమైతే సీబీఐ విచారణకూడా కోరతామని తెలిపారు.

    హీరోలు ఎప్పుడూ గొడవ

    హీరోలు ఎప్పుడూ గొడవ

    హీరోలు ఎప్పుడూ పరస్పరం గొడవలు పడరని చెప్పారు. హీరోలంతా బాగానే కలిసి మెలిసి ఉంటారని.. కానీ ఆయా హీరోల అభిమానులు మాత్రం గొడవలు పడతారని చెప్పారు.

    గొడవలు లేవు

    గొడవలు లేవు

    తోటి హీరోలతో తనకు ఎప్పుడూ ఎలాంటి గొడవలు లేవని పవన్ అన్నారు.

    ఏం జరిగిందో

    ఏం జరిగిందో

    ఇక మరణించిన వినోద్ విషయంలో అసలు ఏం జరిగింది - ఎందుకు జరిగిందనే విషయాలను కోలార్ పోలీసు స్టేషన్ నుంచి పూర్తి వవరాలు తెలుసుకుంటానని పవన్ చెప్పారు.

    అందరూ కలిసే ఉంటాం

    అందరూ కలిసే ఉంటాం

    సినీ పరిశ్రమలో అందరూ కలిసి మెలిసే ఉంటామని - తమమధ్య ప్రొఫెషనల్ పోటీతత్వం ఉంటుంది గానీ.. ఇలా గొడవలు పడే స్థాయిలో ఉండవని.. కానీ అభిమానుల మధ్య మాత్రం అలాంటి పరిస్థితులులు ఉండటం విషాదకరమని తెలిపారు.

    విపత్కర పరిస్దితులు

    విపత్కర పరిస్దితులు

    అభిమానం అనేది కొంతవరకే ఉండాలని అది హద్దులు దాటితే విపత్కర పరిణామాలకు దారితీస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు.

    హితవు

    హితవు

    ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కత్తులతో పొడుచుకోవడం - చంపుకోవడం అనే స్థాయికి అభిమానాలు వెళ్లడం ఎవరికీ ఏమాత్రం మంచిది కాదని ఆయన హితవు పలికారు.

    English summary
    Pawan Kalyan has left for Tirupati this morning to meet and condole the family members of his die-hard fan Vinod Royal, who was murdered in Kolar, Karnataka by another star hero's fan a couple of nights ago.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X