twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ AD: స్పెషల్ చాపర్ ఫైట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తర్వాతి సినిమా 'అత్తారింటికి దారేది' చిత్రం షూటింగ్ నిమిత్తం యూరప్ వెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు యూరప్‌ ఖండంలోని వివిధ ప్రాంతంలో చిత్రీకరణ జరిగింది. షెడ్యూల్ ముగియడంతో హైదరాబాద్ తిరిగి వచ్చారు.

    యూరప్ షెడ్యూల్‌లో పాటల చిత్రీకరణతో పాటు, కొన్ని సీన్స్ షూట్ చేసారు. స్పెయిన్‌లోని ఐస్‌లాండ్‌లో పవన్ కళ్యాణ్, వంశీ(ఒక విచిత్రం హీరో)లపై ప్రత్యేకమైన ఫైట్ సీన్ చిత్రీకరించారు. ఈ ఫైట్ కోసం ప్రత్యేకంగా చాపర్లను వాడారు. ఈ ఫైట్ ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో చిత్రీకరించారు.

    స్పెయిన్‌లోని మిలన్ నుంచి హైదరాబాద్ బయల్దేరిన యూనిట్ సభ్యులు మంగళవారం తెల్లవారు ఝామున 3 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. జులై 4వ తేదీ నుంచి నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అన్పపూర్ణ స్టూడియోలో వేసిన సెట్లో పవన్ కళ్యాణ్, సమంత మరికొందరితో కలిపి పాటను చిత్రీకరించబోతున్నారు.

    మరో వైపు ఈచిత్రం పొస్టు ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. ఆగస్టు మొదటి వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు చెబుతున్నప్పటికీ...ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 'ఎవడు' చిత్రం జులై చివరి వారంలో విడుదల కానున్న నేపథ్యంలో......పవన్ కళ్యాణ్ మూవీ విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

    ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    Pawan Kalyan is back in Hyderabad after a monthlong schedule in Europe for his film in the direction of Trivikram. A few songs, scenes and fights were shot. A special fight was shot in an island in Spain using choppers on Pawan Kalyan and Vamsy in the action choreography of Peter Heins.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X