పవన్ 'పంజా' బిజెనస్ పొజీషన్

By Srikanya

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా మార్కెట్ వర్గాల్లో సంచలనం క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం బిజెనెస్ ఎంక్వైరీలు ఎన్నడూ లేనంతగా జరగుతున్నాయని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం పంపిణీదారులు పోటీపడుతున్నట్లు వినపడుతోంది. రీసెంట్ గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ మార్కెట్లో ఓ క్రేజ్ ని క్రియేట్ చేసింది. అంతేగాక దర్శకుడు ట్రాక్ రికార్డు కూడా సినిమా ప్రమోషన్ కి ఉపయోగపడుతోంది. పులి ఫ్లాప్ ఎఫెక్టు కొంచెం కూడా ఈ చిత్రం బిజెనెస్ పై కనపడటం లేదంటున్నారు. ఇక ఈ చిత్ర్లంలో దెబ్బ తిన్న పులి లాంటి పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారనని దర్శకుడు విష్ణు వర్ధన్ అంటున్నారు. ఆయన తన తాజా చిత్రం పంజా చిత్రం విశేషాలను మీడియాకు వివరిస్తూ...ఒక్క దెబ్బతో నాడీ వ్యవస్థను సైతం విచ్ఛిన్నం చేసే పవర్ పులి పంజాకి సొంతం. అదే దెబ్బతిన్న పులి అయితే... దాన్ని పంజా శక్తి రెట్టింపవుతుంది. ఇక ఎదుట ఉన్నది మదగజం అయినా సరే.. మట్టిలో కలిసిపోవాల్సిందే. ఇందులో పవన్‌కళ్యాణ్ పాత్ర చిత్రణ ఇదే తరహాలో ఉంటుంది. ఆయన స్టామినా ఏమిటో బాక్సాఫీస్‌కి రుచి చూపించే సినిమా ఇది అన్నారు. ఆయన దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ కథానాయకునిగా నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ కలిసి నిర్మిస్తున్న చిత్రం పంజా.

ఇక ఈ చిత్రం ఒక పాట మినహా సినిమా పూర్తయిందని, పవర్‌స్టార్ అభిమానులకే కాక, ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఆనందాన్ని పంచుతుందని విష్ణు వర్దన్ అన్నారు. కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవలే విడుదల చేసిన పవన్‌కళ్యాణ్ స్టిల్స్‌కి అపూర్వమైన స్పందన వస్తోంది. ఇందులో ఆయన గెటప్ ఎంత కొత్తగా ఉందో... పాత్ర చిత్రణ కూడా అంత కొత్తగా ఉంటుంది. స్టయిలిష్ డెరైక్టర్ విష్ణువర్థన్ ఈ సినిమాను న్యూలుక్‌తో ప్రెజెంట్ చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. యువన్‌శంకర్‌రాజా సంగీతం కూడా ఈ సినిమాకు ఎస్సెట్. నవంబరులో పాటలను, డిసెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం. ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు: అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్‌బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్: అనూవర్థన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X