పవన్ కళ్యాణ్ పంజా లిరిక్స్ కి యుట్యూబ్ లో యమా రెస్పాన్స్..!

By Sindhu

'పంజా" లిరిక్ కి యూట్యూబ్ లో ఫుల్ రెస్పాన్స్..పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న 'పంజా చిత్రానికి సంబంధించిన ఓ పాటలోని లిరిక్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ లీకైన లిరక్ 'పంజా" సినిమాలోని టైటిల్ సాంగ్ కి సంబంధించినది అన్న విషయం విధితమే. 'నీ చుర చుర చూపులె పంజా..నీ సల సల ఊపిరె పంజా..నీ నరనరమున నెత్తురె పంజా.." అనే ఈ చరణాలకు యూట్యూబ్ లో మంచి క్లిక్ లు పడుతున్నాయి. లిరిక్ చాలా బాగుందని పవన్ అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని మెగా అభిమానులు అంటున్నారు.

కాగా ఏం జరిగినా దైవ నిర్ణయం అనుకోని సర్దిచెప్పుకోవడం కొన్నిసార్లు చేతకానితనమే. పులి ఎదురుగా ఉన్నప్పుడు అహింసా సిద్ధాంతం వల్లిస్తానంటే కుదరదు. పులి పంజా విసిరేలోపే మన పదునెంతో చూపించాలి. వేటకు వెళ్ళినప్పుడు ఆయుధం లేకపోవడం, చావు ఎదురైనప్పుడు తలదించుకోవడం రెండూ ఒక్కటే. అందుకే మా కథానాయకుడు రంగంలోకి దిగాడు. తన పంజా పదునెంతో చూపించాడు. అదెలాగో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు విష్ణువర్ధన్.

విష్ణువర్థన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పంజా'. పవన్ కళ్యాణ్ కథానాయకుడు. సారాజేన్ డయాస్, అంజలీ లావనియా కథానాయికలు. సంఘ మిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవంబర్ 19న పాటల్ని విడుదల చేస్తున్న విషయం విధితమే. షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నాయి. డిసెంబర్ 9న సినిమా రిలీజ్ చేయబోతున్నాం"" అని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ తెలిపారు.

నిర్మాతలు తిరుమలశెట్టి నీలిమ, శోభు యార్లగడ్డ మాట్లాడుతూ "పవన్ కళ్యాణ్ ని భిన్న రీతిలో చూపించే చిత్రమిది. పంజా పేరు అందరికీ నచ్చింది. పేరుకి తగ్గట్టే కథ, కథనాలు, పవన్ పాత్ర చిత్రణ వుంటాయి. కథా నాయకుడికి, ఇరువురి భామలకీ మధ్య వుండే బంధం కూడా ఆసక్తికరమైనదే" అంటున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X