twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ పార్టీ: చిరు ఆపితే ఫ్యాన్స్ ఆగే పరిస్థితి ఉందా? (కామెంట్ ప్లీజ్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవితంలో ఈ రోజు ఎంతో కీలకమైన రోజు. ఇన్నాళ్లు అన్నయ్య జపం చేసిన పవన్ కళ్యాణ్......గత కొంతకాలంగా అన్నయ్య రాజకీయ పోకడలతో విసుగెత్తి విబేధించారు. అన్నయ్య అభీష్టానికి వ్యతిరేకంగా, అన్నయ్య రాజకీయ జీవితానికి నష్టం కలిగే నిర్ణయాలకు సిద్ధమయ్యారు. నేడు ఆయన సొంతగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. పార్టీ పేరు 'జన సేన'

    నేడు(మార్చి 14)న హైదరాబాద్‌లో పార్టీ ఆవిర్బావం కానుంది. పార్టీ ఆవిర్భావ సమావేశానికి హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ) ఆవరణలోని నోవాటెల్‌ హోటల్‌ను వేదికగా ఎంచుకొన్నారు. దాదాపు 4 వేల మందికి పాల్గొనే విధంగా వేధికను ఏర్పాటు చేసారు. ఇప్పటికే పార్టీ జెండాను, లోగోను విడుదల చేసారు. జన సేన సాంగు కూడా కొందరు అభిమానులు విడుదల చేసారు. నేటి సభలో పవన్ కళ్యాణ్ పార్టీ విధివిధానాలు, లక్ష్యాలు వెల్లడించనున్నారు.

    Pawan Kalyan party: Mega Fans in Dilemma

    పవన్ పార్టీ పెడుతున్న విషయాన్ని కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పవన్‌కు తమ మద్దతు అసలు ఉండదని, మెగా కుటుంబమంతా అన్నయ్య చిరంజీవి వైపే అని నాగబాబు స్పష్టం చేసారు. మెగా అభిమానులు కూడా చిరంజీవి వైపు ఉంటారని నాగబాబు నొక్కి వక్కానించారు.

    ఇదిలా ఉంటే...పవన్ కళ్యాణ్ సభకు అభిమానులు ఎవరూ వెళ్లొద్దని చిరంజీవి ఆదేశించినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి చిరంజీవి ఆపితే అభిమానులు ఆగే పరిస్థితి ఉందా?......మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్సులో వెల్లడించండి.

    English summary
    Power Star Pawan Kalyan's political entry and his new outfit Jana Sena Party have created lot of confusion among the Mega family fans, but none from the family made an attempt to clear the air. A day after the announcement of the party, Chiranjeevi's brother Nagababu has finally broken his silence and released his video interview on YouTube. In this brief interview, he says that Mega family members and fans will support Chiranjeevi and follow his principles.
 
 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X