పవన్ ‘పంజా’ నిర్మాతతో రాజమౌళి-ప్రభాస్ చిత్రం..!
టాలీవుడ్ సెన్సేషనల్ డైరక్టర్ రాజమౌళి సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులే అయిపొయింది. సునీల్ తో చేసిన చిత్రం 'మర్యాద రామన్న" తరువాత ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ప్రస్తుతం నాని హీరోగా తీస్తున్న ఈగ సినిమా దియేటర్లలో సందడి చేయడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. ఈగ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. అయితే గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ ఉండటం వలన రిలీజ్ కు మరో మూడు నుంచి నాలుగు నెలలు సమయం పడుతుంది. అందుకే సమ్మర్ సీజన్ ను క్యాష్ చేసుకునే దిశగా ఈగను మార్చిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
తెలుగుతో పాటు తమిళంలో నాన్ ఈ పేరుతో సినిమా రిలీజ్ అవుతుంది. మార్చి లో ఈగ రిలీజ్ అయిన వెంటనే ఏప్రిల్ లో ప్రభాస్ తో తను తీయబోయే భారీ యాక్షన్ మూవి షూటింగ్ మొదలవుతుంది. ఇప్పటికే ప్రభాస్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా ప్లాన్ జరిగిపోయినట్టు తెలుస్తుంది. ఈగ కోసం ఎక్కువ సమయం ఖర్చు పెట్టినందుకు గానూ తరువాత సినిమాను వీలయినంత తక్కువ టైంలో ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట. రాజమౌళి ప్రభాస్ తో చేసే సినిమాలో హీరో నితిన్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ పంజా చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ప్రభాస్-రాజమౌళిల చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. గతంలో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











