పవన్ 'పులి' ఆడియో రిలీజ్ పోస్టర్ తో ప్రభంజంనం...
'కొమరం పులి"గా గర్జించి బాక్సీఫీస్ రికార్డులన్నిటినీ వేటాడేందుకు వస్తోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభంజనం మెల్లమెల్లగా మొదలవుతోంది. జూలై 11న 'పులి" ఆడియో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ సినిమా పాటలు వినాలనే కాదు..ట్రైలర్స్ ని చూడాలనీ తహతహలాడుతోన్న జనం 'కొమరం పులి"కి చెందిన ఏ చిన్న సమాచారాన్నీ మిస్ అవ్వట్లేదు. ఆ స్పందనని దష్టిలో పెట్టుకునే కొద్ది సేపటి క్రితం 'పులి" ఆడియో రిలీజ్ పోస్టర్ ని ట్విట్టర్ లో రిలీజ్ చేసిన అల్లు శిరీష్ యూ ట్యూబ్ లో తాము క్రియేట్ చేసిన 'పులి" ఫస్ట్ అఫీషియల్ సాంగ్ 'లోకం నీవెంటే లోకం ..ఈ మాటే శ్లోకం" అనే లిరిక్ తో మొదలై ప్రతి తెలుగువాడూ గొంతు కలిపే రేంజ్ లో 'మా తెలుగు తల్లికీ" అంటూ ముగిసిన 'కొమరం పులి" టీజర్ లో మీరూ ఓ సారి ఆస్వాదించాల్సిందే.
దాంతో అశేషాభిమానులు, అసంఖ్యాక ట్విట్టర్ వీక్షకుల కాంప్లిమెంట్స్ తో 'కొమరం పులి" ఆడియో పోస్టర్ ఇప్పుడు తెగ పాపులర్ అయిపోతోంది. 'కొమరం పులి" గెటప్ లో నిజంగా పులిలాగే వున్నప్పటికీ మ్యూజిక్ లాంఛింగ్ కి ఇలాంటి ప్లెజెంట్ డిజైన్ రిలీజ్ చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని చెప్పాలి. పవన్ కళ్యాణ్-ఎఆర్ రెహమాన్ ల ఫస్ట్ కాంబినేషన్ తో వస్తోన్న 'కొమరం పులి" ఆడియో ఖచ్చితంగా ఓ ప్రభంజనం సషించనుందనే కాన్పిడెన్స్ ని కలిగిస్తోంది కదూ ఈ పోస్టర్..!


Click it and Unblock the Notifications











