బ్లాక్ లో పవన్ కళ్యాణ్ ‘కొమరం పులి’ టికెట్ రేటు..!?
పవన్ కళ్యాణ్ నటించిన 'కొమరం పులి" త్వరలో విడుదల కానుంది. కాగా..ఈ టికెట్ల కోసం అప్పుడే పోటీ మొదలయ్యింది. పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది అమీర్ పేటలోని సత్యం థియేటర్ ఓనర్ ని కలిశారట. తాము ఒక్కొక్కరూ మూడు వేల రూపాయలు ఇస్తమని..అందుకు గాను తమకు కొన్ని టికెట్లు ఇవ్వమని ఆ ఓనర్ ను అడిగారట. ఇంకా సినిమా విడుదల తేదీ ఖరారు కాకముందే టికెట్ల కోసం అభిమానులు రావడం ఆశ్ఛర్యంగా ఉందని సదరు ఓనర్ అంటున్నాడు. సినిమా విడుదలయిన తర్వాత బ్లాక్ లో టికెట్ ధర వెయ్యి రూపాయల వరకు పలుకుతుంది కాబట్టే..అభిమానులు ఇలా ఓనర్ ని సంప్రదించి ఉంటారేమో అనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ పులి ఎస్ జె సూర్య ఎఆర్ రెహమాన్ శ్రియ నిఖీషా పటేల్ pawan kalyan nikisha patel puli sj surya ar rahman shriya


Click it and Unblock the Notifications