‘పులి’ క్లైమాక్స్ అదరహో అదరహో..
ఇప్పుడు పరిశ్రలో ఎక్కడ విన్నా ఇదే మాట. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ. 'కొమరం పులి" క్లైమాక్స్ అదరహో అనిపించేలా వుందన్న టాక్ ఇండస్ట్రీలో బాగా స్ప్రెడ్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని అలరించే భారీ యాక్షన్ ఎపిసోడ్ తో పాటుగా ప్రతి ప్రేక్షకుడి చేతా చప్పట్లు కొట్టించే పవర్ ఫుల్ డైలాగ్స్ తో 'కొమరం పులి" క్లైమాక్స్ దశ్యాలను మలిచారట. ఓ వైపు 'పులి" రిలీజ్ డిలే అవడంపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నా ఎప్పటికప్పుడు ఈ భారీ చిత్రం గురించి ఇలా పాజిటివ్ రిపోర్ట్స్ వినిపిస్తూ ఉండటం నిజంగా విశేషమనే చెప్పాలి. మరింతకీ పవన్ 'పులి" సెప్టెంబర్ 9కైనా బోనులోనుంచి బయటపడతాడో లేదో ప్రేక్షకాభిమానుల నిరీక్షణను ఇంకా పొడిగించి నీరసం తెప్పిస్తాడో చూడాలి.
పవన్ కళ్యాణ్ నిఖీషా పటేల్ యస్ జె సూర్య శింగనమల రమేష్ పులి pawan kalyan nikisha patel sj surya singanamala ramesh puli


Click it and Unblock the Notifications