మెగా బ్రదర్ కి పవన్ కానుక - పవన్ కి బ్లాక్ మెయిలింగ్
'జల్సా" చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకోని పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం 'కొమరంపులి" ఆగస్ట్ 11న విడుదల కానుందని అభిమానలోకం ఎదురుచూస్తుంది. కాని పులి వర్క్ ఇంకా పెండింగ్ లోనే వుంది. పవన్ డబ్బింగ్ తో పాటు ఎ.ఆర్.రెహ్మాన్ రీ-రికార్డింగ్ కుడా ఇంకా బ్యాలెన్స్ మిగిలివుంది.
సో పులి ఆగస్ట్ 11న వచ్చే అవకాశాలు దాదాపు లేనట్లే. ఇక ఎలాగు లేటు అయ్యింది కాబట్టి తన చిత్రాన్ని అన్నయ్య చిరంజీవి పుట్టిన రోజు కానుకగా ఆగస్ట్ 22న విడుదల చేయాలనే ఆలోచనలో వున్నాడు పవన్. సో ఇక ఆగస్టు 22న మెగా అభిమానులకు రెండు పండుగలు వచ్చినట్లే.
ఇదిలా ఉంటే ఆంధ్ర హీరోల సినిమాలు తెలంగాణా జిల్లాలో ఆడనివ్వం అడ్డుకుంటామంటూ టిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు అడ్డుకుంటున్న విషయం మీకు తెలిసిందే ఈ నేపద్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'కొమరం పులి" ఆగస్ట్ లో రిలీజ్ కు సిద్దమవుతున్న తరుణంలో ఈ చిత్రాన్ని కూడా అడ్డుకుంటామంటూ కెసిఆర్ కుమార్తె కవిత బ్లాక్ మెయిలింగ్ చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి ఆరోపించాడు. అన్నట్టు ఎన్టీఆర్ హీరోగా నటించిన 'అదుర్స్" సినిమా విషయంలో కూడా కవిత డబ్బులు భారీగా తీసుకుందనే వార్తలు కూడా వచ్చాయి. ఇక పవన్ 'కొమరం పులి" తెలంగాణాలో ఆడాలంటే 10 కోట్లు డిమాండ్ చేస్తోందట కవిత.


Click it and Unblock the Notifications











