లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడు పవన్ ‘కొమరం పులి’!
జల్సా సినిమా తర్వాత చాలా గ్యాప్ తర్వాత 'కొమరం పులి" ఎప్పుడూ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు వస్తున్నది పోలీస్ గెట్ ప్ తో ప్రేక్షకులను అలరించడానికి త్వరలో మనముందుకు రాబోతున్నారు. టాలీవుడ్ లో ఆకాశమంత ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో కొత్త రికార్డ్స్ ను సృష్టించడం ఖాయం అని, ఖుషి ఫెమ్ ఎస్ జె సూర్య ఈ చిత్రంతో పవన్ కి మంచి పెద్ద హిట్ ఇస్తాడనే ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
దాంతో టాలీవుడ్ పవర్ స్టార్ సెన్సేషన్స్ మళ్ళీ ఆరంభమయ్యాయి. రిలీజ్ కి ముందే 'పులి" రికార్డ్స్ ప్రారంభమైపోయాయి.! ఆల్ రెడీ ఓవర్సీస్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ లో తెలుగు సినీ పరిశ్రమ కనీవినీ ఎరుగని మ్యాజిక్ ఫిగర్స్ ని రీచ్ అయిన 'పులి" కి రిలీజ్ కూడా అనూహ్యమైన స్థాయిలో జరుగబోతోంది. హై డిమాండ్, హై ఎక్స్ పెక్టేషన్స్, హై పొటెన్షియాలిటీ వున్న 'పులి" చిత్రాన్ని తొలివారంలోనే వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో ప్రేక్షకులకు చూపించి అటు బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేసెయ్యడంతో బాటు ఇటు పైరసీ రక్కసినీ ఆదిలోనే అణిచివెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ వ్యూహం మేరకే జూన్ ప్రదమార్థంలో వెయ్యికి పైగా ప్రింట్స్ తో 'పులి" ని రిలీజ్ చెయ్యనున్నారు. ఇప్పటికే రెండు పాటల చిత్రీకరణ మినహా టోటల్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం దిగ్రేట్ ఆస్కార్ విజేత ఎ ఆర్ రహమాన్ నేతత్వంలో లండన్ లో రీ రికార్డింగ్ జరుపుకుంటోంది. బ్యాలెన్స్ వున్న రెండు పాటల్లో ఈనెల 18 నుండి 24వరకూ ఒకపాటనీ, 26 నుండి మరో పాటనీ చిత్రీకరిస్తారు. ఇక 'పులి" ఆడియో ఈ మంత్ ఎండ్ కి మర్కెట్ లోకి రానుంది.


Click it and Unblock the Notifications











