పవన్-పూరి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’
పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన చేశాడు దర్శకుడు. తాజాగా శుక్రవారం తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమా టైటిల్ ప్రకటించారు పూరి జగన్నాథ్. ఈ చిత్రానికి 'కెమెరామెన్ గంగతో రాంబాబు' అనే టైటిల్ ఖారారు చేసినట్లు వెల్లడించారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించబోతున్నాడు. మే నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.
గతంలో బంగారం సినిమాలోనూ పవన్ కళ్యాణ్ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాన్ సరసన కాజల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటిస్తున్నాడు. హారిష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న విడుదల కానుంది.పవన్ కళ్యాణ్ ఇందులో కొండవీడు పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications