పవన్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ పూజ జరిగింది
పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం పూజ ఈ రోజు(మార్చి 14)జరగింది. హైదరాబాద్ లో ని పూరీ జగన్నాధ్ ఆఫీసులో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. జూలై నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. రాజమౌళి, అలీ, నిర్మాత దానయ్య, బివియస్ ఎన్ ప్రసాద్, శ్యామ్ కె నాయుడు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించబోతున్నాడు. గతంలో బంగారం సినిమాలోనూ పవన్ కళ్యాణ్ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.
యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాన్ సరసన కాజల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. జూలైలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటిస్తున్నాడు. హారిష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న విడుదల కానుంది.పవన్ కళ్యాణ్ ఇందులో కొండవీడు పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











