ఐసీయూ లో అల్లు శిరీష్ ఉంటే...పవన్ కన్నీళ్లు, నేచురోపతినే నమ్ముతాడు

By Srikanya

హైదరాబాద్ : పైకి చూడటానికి పవన్ ఎవరినీ పట్టించుకోనట్లు ఉంటారు. ఎవరితోనూ రిలేషన్ పెట్టుకోని రుషి లాగ కనిపిస్తారు. కానీ ఆయన చాలా సెన్సిటివ్, చిన్న చిన్న విషయాలకే ఆయన కదిలిపోతారు. ఈ విషయాలు ఆయన దగ్గరున్న వాళ్ళు చెప్తూంటారు.

రీసెంట్ గా ఒక అభిమాని గొడవల్లో పడి చనిపోయినప్పుడు అతని ఇంటికి వెళ్ళి పవన్ కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే క్యాన్సర్ తో పీడించబడుతున్న చిన్నారులను కలిసినప్పుడు కూడా పవన్ కన్నీరు పెట్టుకున్నారు. ఆయన సెన్సిటివ్ అనే విషయం మరోసారి చెప్తూ ఆయనకు సన్నిహితుడైన అల్లు శిరీష్ ఓ సంఘటన ఈ రోజు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

అల్లు శిరీష్ చెప్పిన సంఘటన ఇది, ఈ సంఘటన 2007 లో జరిగింది. అప్పటికి ఇంకా హీరో అవ్వాలని కూడా అల్లు శిరీష్ కూడా ఫిక్స్ కాని రోజులు. అయితే అప్పట్లో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన అల్లు శిరీష్ జీవితంలో జరిగింది. ఆ సంఘటన అల్లు శిరీష్ మాటల్లోనే..

''2007లో నాకు ఒక కార్ యాక్సిడెంట్ అయ్యింది. నన్ను ఐ.సి.యు.లో పెట్టారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారికి నాతో అంతగా పరిచయం లేకపోయినా కూడా.. నన్ను చూడ్డానికి వచ్చి ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆ సంఘటన నేను ఇప్పటికీ మర్చిపోలేను. అంతటి సెన్సిటివ్ మనిషి ఆయన'' అంటూ చెప్పాడు శిరీష్.

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టినప్పటికీ తనకంటూ తాను సృష్టించుకున్న ప్రత్యేకమైన స్టైల్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగు ప్రజల ప్రత్యేక అభిమానాన్ని పొందిన పవన్ అలవాట్లకు సంబంధించిన కొన్ని ఆశక్తికర విషయాలను అల్లు శిరీష్ బయట పెట్టాడు.

ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. అసలు పవన్ వ్యక్తిత్వం ఎటువంటిది అని చెప్పడానికి శిరీష్ ఇదంతా చెప్పుకొచ్చాడు. అలాగే మరిన్ని విషయాలు ఈ సందర్బంగా అల్లు శిరీష్ మనకు తెలియనవి చెప్పారు..

నాచురోపతి

నాచురోపతి

పవన్ నేచురోపతి వైద్యాన్ని బాగా నమ్ముతాడని. అదే విధంగా కాస్మోటిక్స్ పవన్ ఏ సందర్భంలోను వాడడు అన్న విషయాన్ని తెలియ చేసాడు శిరీష్.

అందుకే నిత్య యవ్వనంగా

అందుకే నిత్య యవ్వనంగా

అంతేకాదు పవన్ సహజ సిద్ధమైన ఆమ్లా లతో పాటు నీమ్ సికాయి జ్యూస్ ని పవన్ తెగ వాడతాడని, అదే ఆయన యవ్వన రహస్యం అన్న విషయాన్ని బయట పెట్టాడు శిరీష్.

యోగి

యోగి

ఇదే సందర్భంలో పవన్ ను ఒక యోగి వ్యక్తిత్వంతో పోలుస్తూ పవన్ యోగ శాస్త్రంలోని అష్టాంగ యోగాను ప్రతిరోజు ఆసనాలుగా వేస్తాడని అయితే ఇది యోగాసనాలలో చాల క్లిష్టమైన ఆసనం అని చెప్పాడు శిరీష్

క్లిష్టమైనవి

క్లిష్టమైనవి

అంతేకాదు పవన్ తన మైండ్ ను బాడీ నీ అదుపులో పెట్టుకోవడానికి తాడుతో కూడుకున్న కొన్ని క్లిష్టతరమైన వ్యాయామాలను చేస్తాడు అన్న విషయాన్ని బయట పెట్టాడు శిరీష్.

అష్టాంగ యోగ

అష్టాంగ యోగ

మనందంరం సాధారణంగా హఠ యోగాన్ని ప్రాక్టీస్ చేస్తాం, కానీ ఆయన అష్టాంగ యోగని ప్రాక్టీస్ చేస్తూంటారు. అది చాలా చాలా కష్టమైనది.

రీడర్

రీడర్

అలాగే పవన్ ఒరాసియస్ రీడర్ అని, పుస్తకాలను హైదరాబాద్ వాల్డెన్ షాపు నుంచి కొంటూ ఉంటారని, తాను తర్వాత వెళ్లినప్పుడు పవన్ కొన్న పుస్తకాలు గురించి అక్కడ క్లర్క్ చెప్తాడని, అవి ఒక సబ్జెక్టు మీద కాక రకరకాల విషయాలమీద ఉంటాయని చెప్పారు.

సెన్సిటవ్ పర్శన్

సెన్సిటవ్ పర్శన్

ఇక పవన్ చాలా చాలా సెన్సిటివ్ పర్శన్. చిన్న విషయానికి కూడా ఆయన మానసికంగా కదిలిపోతారని, అద్బుతమైన వ్యక్తిత్వం కలిగి ఉన్న మానవతావాది అని అన్నారు.

పూర్తి వ్యతిరేకం

పూర్తి వ్యతిరేకం

‘సినిమాల్లో అశ్లీలత, అసభ్యత, మద్యపానం, ధూమపానం వంటివాటిని ప్రదర్శించడానికి నేను పూర్తి వ్యతిరేకం' అంటూ ఆదర్శంగా నిలిచే వ్యక్తి పవన్.

సిగ్గరి

సిగ్గరి

పవన్‌కల్యాణ్‌కు చాలా సిగ్గట. కెమెరా ముందూ ఆ సిగ్గు ఉంటుందట. డ్యాన్స్‌ చేయాలన్నా, నటించాలన్నా సిగ్గే. రోడ్డు మీదకు తీసుకెళ్లి.. ‘ఇక్కడో స్టెప్పు వేయండీ' అంటే కుచించుకుపోతాడట. అందుకే విదేశాల్లో ఎవరూ లేని చోట నాకు తోచిన స్టెప్పులేస్తా అని నవ్వుతూ చెప్తారాయన.

ప్రయాణమే ముఖ్యం

ప్రయాణమే ముఖ్యం

‘నాకు ప్రయాణం ముఖ్యం. ఫలితం కాదు. ఓ వ్యక్తి గురించి మాట్లాడాలంటే వాడు పుట్టినప్పటి నుంచీ చనిపోయేంత వరకు వాడి జీవితం చూసి నిర్ణయానికి రావాలి. అంతే తప్ప 24 గంటలూ గెలిచాడా, లేదా? అంటూ లెక్కలేసుకోకూడదు' అని పవన్‌ అంటుంటారు.

హిట్టా, ఫ్లాఫా అనవసరం

హిట్టా, ఫ్లాఫా అనవసరం

సినిమాలు విడుదలయ్యాక ఫలితం, వసూళ్ల గురించి కూడా ఆరా తీయరట. తన పని నటించడం వరకేనని, కనీసం సినిమా ఎలా ఉందని ఎవర్నీ అడగనని అంటారాయన. ‘బాగుంది..' అన్నా. ‘బాగోలేదు' అన్నా ఒకటే స్పందన వస్తుందట పవన్‌ నుంచి.

ప్రస్తుతం

ప్రస్తుతం

పవన్‌ ప్రస్తుతం కిశోర్‌కుమార్‌ పార్థసాని(డాలీ) దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన సరికొత్త ప్రేమికుడిగా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి ‘కాటమరాయుడు' పేరు పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X