పవన్ కళ్యాణ్ ‘లా బుక్స్’ ఎందుకు చదువుతున్నాడు?

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్.....దీని తర్వాత క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ న్యాయ శాస్త్రంలోని అంశాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాడట.
ఈ సినిమా సంగతి పక్కన పెడితే....పవన్ కళ్యాణ్ తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ అయిన 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ప్రై.లి'పై ఓ వచిత్రమైన టైటిల్ రిజిస్టర్ చేయించారు. 'కో..బలి'(నరుకు..బలి) అనే టైటిల్ జనవరి నెలలో ఏఫీ ఫిల్మ్ ఛాంబర్లో పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్ హౌజ్ పేరిట రిజిస్టర్ అయింది.
ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ తమిళనాడులోని పొల్లాచ్చిలో జరుగుతోంది. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. ఈ చిత్రంలో పవన్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. సెకండ్ హీరోయిన్ గా ప్రణీత ఎంపికయింది.


Click it and Unblock the Notifications











