నిర్మాతలకు పవన్ కళ్యాణ్ నష్ట పరిహారం

By Bojja Kumar

తన వల్ల షూటింగ్ రద్దయితే ఇకపై సదరు చిత్ర నిర్మాతలకు నష్ట పరిహారం చెల్లించాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఇకపై తప్పకుండా సెట్ లో అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. సినిమా బడ్జెట్ కంట్రోల్‌లో పెట్టేందుకే పవన్ ఈ డెసిషన్ తీసుకున్నారు. 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం నుంచే తన నిర్ణయాన్ని పవన్ అమలు చేయనున్నారు.

పెద్ద హీరోలతో సినిమా అంటే ఒక రోజు ప్రొడక్షన్ కాస్ట్ లక్షల్లో ఉంటుంది. అంతా రెడీ అయ్యాక హీరో రాక పోతే...షూటింగ్ రద్దయితే నిర్మాత నష్టపోతుంటాడు. చాలా సందర్భాల్లో ఇలాంటి జరిగాయి కూడా. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయం అంటున్నారు నిర్మాతలు.

క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ 15 నుంచి ప్రారంభం అయింది. తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో జరుగబోతోంది. పవర్ స్టార్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈచిత్రంలో పవర్ స్టార్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించబోతున్నారు.

అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాన్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి ఇప్పటి వరకు ముఖ్య తారాగణంగా ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X