రాజకీయాల్లోకి అల్లు అర్జున్: సీక్రెట్ చెప్పిన జేసీ పవన్ రెడ్డి!
Recommended Video

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా". కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మే 4న సినిమా విడుదల చేస్తున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ చిత్రం సీడెడ్ రైట్స్ దక్కించుకున్న జేసీ పవన్ రెడ్డి (జేసీ దివాకర్ రెడ్డి తనయుడు) అల్లు అర్జున్ గురించి ఓ సీక్రెట్ వెల్లడించారు.

ఇది దేశ భక్తితో కూడిన సినిమా
ఇది దేశ భక్తితో కూడిన సినిమా. మన దేశం జై జవాన్ జై కిసాన్ అని నమ్మే దేశం. చిరంజీవి గారు జై కిసాన్ అంటూ ఖైదీ నెం.150 చేశారు. ఈ రోజు బన్నీ జై జవాన్ అంటూ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చేశారు.... అని పవన్ రెడ్డి తెలిపారు.

బన్నీ చాలా సింపుల్ పర్సన్
బన్నీ గురించి రెండు మాటలు చెబతాను. అతడు అందరిలాగా ఫిల్మీ పర్సన్ కాదు. ఫిల్మ్ స్టార్ అంటేనే ఆకాశంలో నడుస్తారు. కానీ బన్నీ ఎప్పుడూ భూమి మీద నడుస్తుంటాడు. ఆయన చాలా సింపుల్ పర్సన్ అని చెప్పుకొచ్చారు.

ప్రేమ మమకారాల విషయంలో మేము ఎవరికీ తక్కువ కాదు
బన్నీని ఒక విషయంలో రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు సినిమా ఫంక్షన్ చేయడానికి వెస్ట్ గోదావరి వెళ్లారు. మాది రాయల సీమ. ఫైనాన్షియల్లీ చాలా వీక్. కానీ ప్రేమ మమకారాల విషయంలో మేము ఎవరికీ తక్కువ కాదు. అన్ని ఫంక్షన్లు విజయవాడ, హైదరాబాద్ లో చేస్తున్నారు. మా అనంతపురం రండి.... ఏ విధంగా ప్రేమ చూపిస్తామో చూడండి. వేల మంది, లక్షల మంది మీ ఫంక్షన్లకు వస్తారు. ఒక కొత్త ఒరవడి మొదలు పెట్టండి.

బన్నీ గురించి సీక్రెట్ చెప్పిన జేసీ పవన్ రెడ్డి
నేను మీకు ఒక సీక్రెట్ చెబుదామనుకున్నాను. బన్నీకి రాజకీయ అవగాహన చాలా ఉంది. మీకు తెలియని విషయం ఏమిటంటే పాలిటిక్స్ చాలా క్షుణ్ణంగా ఫాలో అవుతారు. రాబోయే రోజుల్లో పొలిటీషియన్ కూడా అవుతాడనుకుంటున్నాను. (దీనికి బన్నీ రియాక్ట్ అవుతూ...కాదు కాదు అని చేతులు ఊపుతూ నవ్వులు). నీకు మంచి పొలిటీషన్ అయ్యే లక్షణాలు ఉన్నాయి. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ విషయంలో రూపాయికి వెయ్యి రూపాయల పందెం కట్టడానికి కూడా నేను సిద్ధమే.... అని పవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











