twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ ‘జన సేన’ పార్టీకి 12 కోట్ల ఆఫర్?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల 'జన సేన' పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న నోవాటెల్ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీటింగులో పవన్ కళ్యాణ్ తాను ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి వస్తుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఈ దేశంతో పాటు, తెలుగు ప్రజలను కష్టాల పాలు చేసిన కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలని పిలుపు నిచ్చారు.

    కాగా....పవన్ కళ్యాణ్ పార్టీకి మంచి క్రేజ్ ఏర్పుడుతున్న నేపథ్యంలో పలువురు పొలిటీషియన్లు ఆయన పార్టీలో చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ పొలిటీషన్ పార్టీ‌లో చేరడానికి పవన్ కళ్యాణ్‌ను సంప్రదించాడని, రూ. 12 కోట్ల పార్టీ ఫండ్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

    Pawan rejects 12 crores offer?

    అయితే పవన్ కళ్యాణ్ అతని రాకతో పాటు, అతను ఆఫర్ చేసిన రూ. 12 కోట్ల పార్టీ ఫండ్ ను నిర్మొహమాటంగా తిరస్కరించినట్లు సమాచారం. తాను సమాజాన్ని బాగు చేయడానికి పార్టీ పెట్టానే తప్ప, రాజకీయ నిరుద్యోగుల కోసం కాదని, ఇతర పార్టీల నుండి వచ్చే వలసలను, జంప్ జిలానీలను తాను ఎట్టి పరిస్థితుల్లో ప్రొత్సహించబోనని, రాజకీయాల్లో మార్పు తేవడానికే తాను వచ్చానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

    సదరు పొలిటీషయన్‌కు ఎదురైన సంఘటన ఇప్పటికే పొలిటికల్ సర్కిల్‌లోకి వ్యాపించింది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల్లో ఉన్న వారెవరూ పవన్ కళ్యాణ్ పార్టీ వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. సామాజిక, రాజకీయ ఎజెండాతో ముందుకు సాగే జనసేన పార్టీ ప్రజల మేలు కోసం సుదీర్ఘ లక్ష్యాల కోసం తన పోరాటాన్ని సాగించనుంది.

    English summary
    
 According to source, one of the leaders from Andhra met Pawan Kalyan at his house recently. He expressed his wish to be a part of JanaSena & offered 12 crores as party fund. Actor-turned-politician Pawan Kalyan simply rejected the offer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X