»   » నిజమే ఇది పవన్ అరుదైన (ఫొటో)నే

నిజమే ఇది పవన్ అరుదైన (ఫొటో)నే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తో తను గడిపిన రోజులు, ఆ ఫొటోలను, స్మృతులను జ్ఠప్తి చేసుకుంటోంది రేణు దేశాయ్. ఈ రోజు ఆమె గతంలో పవన్ ,సచిన్, తను దిగిన ఫొటోను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసి, పవన్ అబిమానులకు ఆనందం కలగచేసింది. ఆమె ఈ ఫొటోను 2003 లోది గా పేర్కొన్నారు.

ఆమె ఈ ఫొటోనాటి విశేషాలు తెలియచేస్తూ... " ఇప్పుడే 2003 నాటి ఈ అరుదైన ఫొటో దొరికింది. ఇండియన్ క్రికెట్ టీమ్ తో కలిసి చేసిన డిన్నర్ ఫంక్షన్ లోది. ఈ స్పెషల్ ఫొటోను మీకు షేర్ చేస్తున్నాను. ," అని ఆమె ఆ రోజులు ఈ ఫొటో ద్వారా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో...టాలీవుడ్ సెలబ్రెటీలు,ఇండియన్ క్రికెట్ టీమ్ మధ్య ఛారెటీ మ్యాచ్ జరిగింది. అప్పుడు చిరంజీవి..ఆ టీమ్ అంతటికీ తన ఇంట్లో డిన్నర్ పార్టీ ఎరేంజ్ చేసారు. అప్పుడు తీసిందీ ఫొటో.

Pawan & Renu Desai with Sachin!

ఇక పవన్ కళ్యాణ్ తాజా చిత్రం విషయాలకి వస్తే... 'గోపాల గోపాల' సెట్‌లో కృష్ణుడుగా పవన్ అడుగు పెట్టాడు. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధానపాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'గోపాల గోపాల'. శ్రియ ముఖ్య పాత్రధారి. కిషోర్‌ పార్థసాని (డాలి) దర్శకుడు. హిందీలో విజయవంతమైన 'ఓ మైగాడ్‌'కిది రీమేక్‌. అందులో పరేష్‌ రావల్‌ పోషించిన పాత్రను ఇక్కడ వెంకటేష్‌, అక్షయ్‌ కుమార్‌ చేసిన కృష్ణుడు పాత్రను పవన్‌ కల్యాణ్‌ చేస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవల రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి పవన్‌ కల్యాణ్‌ కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ రోజు వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు.

English summary

 "Just now found a pic of 2003. A dinner function with the entire Indian cricket team.sharing this special pic wit u," wrote Renu, apart from sharing the picture.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu