సైరా నరసింహా రెడ్డిలో పవన్ పాత్ర ఇదే: పది నిమిషాలకు పైగానే అన్నయ్యతో తమ్ముడు

మెగాస్టార్- పవర్ స్టార్ మరోసారి కలిసి తెరపై అభిమానులకు కనువిందు చేయబోతున్నారు. సైరా నరసింహా రెడ్డిలో మళ్ళీ అన్నయ్యతో కలిసి తెరమీద కనిపించ బోతున్నాడట పవన్...

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తే అభిమానులకు పండగే. గతంలో అన్నయ్య నటించిన కొన్ని సినిమాల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ చిన్న పాత్రల్లో మెరిసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మెగాస్టార్- పవర్ స్టార్ మరోసారి అన్నయ్యతో కలిసి తెరమీద కలిసి తెరపై అభిమానులకు కనువిందు చేయబోతున్నారు. సైరా నరసింహా రెడ్డిలో మళ్ళీ కనిపించ బోతున్నాడట పవన్...

శంకర్ దాదా ఎంబీబీఎస్

శంకర్ దాదా ఎంబీబీఎస్

గతం లో చిరంజీవి చేసిన శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఒక క్యామియో లో కనిపించిన పవన్ ఆ తర్వాత అదే సినిమాకి సీక్వెల్ గా వచ్చిన శంకర్ దా జిందాబాద్ లో గెస్ట్ రోల్ చేసాడు... అయితే ఈ సారి మాత్రం అలా వచ్చి ఇలా వెళ్ళిపోడట.కనీసం పది నిమిషాలకంటే పైగానే పవన్ చిరు కలిసి కనిపించ బోతున్నారు.

 ఎంతో ప్రిస్టేజియస్‌గా

ఎంతో ప్రిస్టేజియస్‌గా

మొదట ఈ పాత్రకోసం విక్టరీ వెంకటేష్ ని అనుకున్నారన్న టాక్ కుడా వచ్చినా పవన్ మాత్రం ఈ పాత్ర మీద చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడట. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రిస్టేజియస్‌గా తీసుకున్న 'సైరా..నరసింహారెడ్డి' ఇప్పటికే ముహూర్తాన్ని జరుపుకున్నా ఇంకా సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. అయితే ఈ చిత్రంలోని నటీనటుల లిస్ట్ మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది.

10 నిమిషాల నిడివి గల కీలక పాత్ర

10 నిమిషాల నిడివి గల కీలక పాత్ర

ఇప్పటికే పలు భాషల నుంచి ఉద్దండులైన నటులను ఎంపిక చేసుకున్న 'సైరా..' యూనిట్ తాజాగా ఈ చిత్రంలోని 10 నిమిషాల నిడివి గల కీలక పాత్రకు పవర్‎స్టార్ పవన్‌కళ్యాణ్‌ను సంప్రదించిందట. అన్నయ్య ప్రతిష్ఠాత్మక చారిత్రక చిత్రంలో కనిపించేందుకు.. కూడా సై అన్నాడట పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్.

 చిరంజీవిపై టెస్ట్ షూట్

చిరంజీవిపై టెస్ట్ షూట్

ఇక ఇటీవలే 'సైరా నరసింహారెడ్డి' కోసం చిరంజీవిపై టెస్ట్ షూట్ నిర్వహించింది టీమ్. తాజాగా ఈ చిత్రంలో నటించనున్న విజయ్ సేతుపతి, నాజర్ పాత్రలకు కూడా మేకప్ వేసి టెస్ట్ షూట్స్ నిర్వహించాడట డైరెక్టర్ సురేందర్ రెడ్డి.

విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి

ఈ షూట్ కోసమే చెన్నై నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చాడట కోలీవుడ్ రైజింగ్ హీరో విజయ్ సేతుపతి. ఇక ఈ టెస్ట్ షూట్ రిజల్ట్ పట్ల 'సైరా..' టీమ్ ఎంతో సంతృప్తిగా ఉన్నారట. మొత్తంమీద ఇప్పటికే పక్కాగా ప్రి-ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ హిస్టారికల్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X