ప్యూర్ పవన్ షో ('...గంగతో రాంబాబు ' ప్రివ్యూ)
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కెమెరామన్ గంగతో రాంబాబు' ఈ రోజు భారీ ఎత్తున అభిమానులను ఆనందం కలగచేస్తూ విడుదల అవుతోంది. 'గబ్బర్‌సింగ్' తర్వాత కల్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు హెవీగా ఉన్నాయి. ఆ అంచనాలు అన్నిటినీ మించి ఈ చిత్రం ఉంటుందంటున్నారు దర్శకుడు పూరీ జగన్నాధ్. అలాగే కల్యాణ్‌కీ, నాకూ 'కెమెరామన్ గంగతో రాంబాబు' కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని చెప్తున్నారు.
కథ చూస్తే... ఓ మామూలు కారు మెకానిక్ నుంచి చానల్ రిపోర్టర్‌గా మారిన రాంబాబు కథ. అందరూ చదివి వదిలేసే వార్తల్ని రాంబాబు సీరియస్‌గా తీసుకుని, వాటికి రియాక్ట్ అవుతుంటాడు. గంగ అనే కెమెరా(ఉ)మన్ వల్ల చానల్ రిపోర్టర్ అవుతాడు. ఒక రాజకీయ నాయకునికీ, అతనికీ మధ్య జరిగే గొడవ ఈ సినిమా. మీడియాని వాడుకుని ఆ రాజకీయ నాయకుడు ఎదగాలనుకుంటే, అదే మీడియాని వాడుకొని రాంబాబు అతన్ని ఎలా అడ్డుకున్నాడనేది ఆసక్తికరమైన పాయింట్. అయితే ఇందులో రాజకీయాలు, మీడియా నేపథ్యం ఉన్నప్పటికీ వాటి మధ్య గొడవల జోలికి పోలేదు. ఇది సమకాలీన రాజకీయాల మీద తీసిన సినిమా కాదు.
కథలో, రాంబాబు కేరక్టర్‌లో ఫైర్ ఉంటుంది. ఆ పాత్రలో నిజాయితీ ఉంటుంది. జనాన్ని చైతన్యపరుస్తూ కల్యాణ్ చెప్పే నాలుగు నిమిషాల డైలాగ్ ఉంటుంది. సినిమాలోనే అది బెస్ట్ డైలాగ్. ఇందులో కల్యాణ్, తమన్నా, ప్రకాశ్‌రాజ్, కోట శ్రీనివాసరావు పాత్రలకు అవార్డులు వస్తాయి. కోట, ప్రకాశ్‌రాజ్ తండ్రీ కొడుకులుగా కనిపిస్తారు. తమన్నా అంత బాగా చేస్తుందని అనుకోలేదు. అదివరకు ఆమె సినిమాలేవీ చూడలేదు. గంగ పాత్రను చాలా బాగా చేసింది. టామ్‌బాయ్ కేరక్టర్. కల్యాణ్ 'ఏవండీ... మీరు' అని గౌరవంగా పిలిస్తే, ఆమె అతన్ని 'నువ్వు' అని సంబోధిస్తుంటుంది.
బ్యానర్: యూనివర్సల్ మీడియా,
నటీనటులు పవన్ కళ్యాణ్, తమన్నా, గేబ్రియేల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు
ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు,
సంగీతం: మణిశర్మ
ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా,
ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్,
ఫైట్స్: విజయ్,
స్టిల్స్: మాగంటి సాయి,
కో-డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్,
సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ,
నిర్మాత: డి.వి.వి దానయ్య,
కథ-స్క్ర్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











