‘కెమెరామెన్ గంగతో...’ సెకండ్ షెడ్యూల్ డీటేల్స్
'గబ్బర్ సింగ్' సెన్షేషన్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. పూరి జగన్నాథ్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ స్టార్ సరసన తమన్నా హీరోయిన్. గత కొంత కాలంగా అమీర్‌పేటలోని సారథి స్టూడియోలో జరుగుతున్న ఈచిత్రం షెడ్యూల్ పూర్తయింది. ఇంత కాలం ఇక్కడ పవన్ కళ్యాణ్ పై పలు కీలక సన్నివేశాలతో పాటు బ్రిటిష్ భామ స్కార్లెట్ విల్సన్‌పై ఐటం సాంగు చిత్రీకరించారు.
తాజాగా ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ఖరారైంది. జులై 8 నుంచి ప్రారంభం కానున్న షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్, తమన్నాపై పలు సీన్లు చిత్రీకరించనున్నారు. తమన్నా మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా గ్రాబియేలా బెర్టాంటె ఓ చిన్న పాత్రలో నటిస్తోంది.
సినిమా షూటింగుల విషయంలో పక్కా ప్లాన్ ఫాలో అయ్యే దర్శకుడు పూరి జగన్నాథ్...ఈచిత్రాన్ని పర్ ఫెక్ట్ ప్లాన్ ప్రకారం పూర్తి చేసి అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర జర్నలిస్టు అని ఆ మధ్య వార్తలు వినిపించినప్పటికీ...అది వాస్తవం కాదని, పవన్ ఇందులో మెకానిక్‌గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. హీరోయిన్ తమన్నా ..గంగగా మీడియాకు చెందిన వ్యక్తిగా కనిపిస్తుంది. ఆమె మెకానిక్ గా ఉండే పవన్ తో కలిసి సమాజానికి పనికివచ్చే రిపేర్స్ చేయిస్తుంది. మెకానిక్ గా ఉండే అతను కెమెరా తో సమాజంలోని కొన్ని దారుణాలను ప్రజల ముందుకు తీసుకువచ్చి అవకతవకలను సరిచేస్తాడని చెప్పుకుంటున్నారు. ఈ పాత్ర పవన్ కెరీల్ లో ఓ కొత్త యాంగిల్ లో మాస్ కి పట్టేలా ఉంటుందని సమాచారం.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్


Click it and Unblock the Notifications











