Just In
- 59 min ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
- 2 hrs ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్‌నే ఫిక్స్ చేశారు
- 3 hrs ago
టాలీవుడ్లో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ వరకు!
- 3 hrs ago
రాజమౌళి - మహేశ్ మూవీ నుంచి షాకింగ్ న్యూస్: ఎవరూ ఊహించని పాత్రలో సూపర్ స్టార్
Don't Miss!
- News
రజనీకాంత్ సేన వలసల బాట .. డీఎంకేలో చేరిన మక్కల్ మండ్రం నేతలపై తలైవా టీమ్ చెప్పిందిదే !!
- Lifestyle
ఆరోగ్య సమస్యలకు మన పూర్వీకులు ఉపయోగించే కొన్ని విచిత్రమైన నివారణలు!
- Finance
పెట్రోల్, డీజిల్ ధరలు జంప్: హైదరాబాద్‌లో ఎంత ఉందంటే
- Sports
Brisbane Test: తొలిసారి ఐదేసిన సిరాజ్.. ఆసీస్ ఆలౌట్! టీమిండియా టార్గెట్ 328!
- Automobiles
టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో పెర్ఫార్మెన్స్ను చూపించే కొత్త టీజర్ విడుదల
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ అభిమానిపై దాడి: నిందితుల ఊహాచిత్రం విడుదల!
హైదరాబాద్: ‘గోపాల గోపాల' ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా ఓ అభిమానిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి గొంతు కోసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించిన ఇద్దరు నిందితుల ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. శిల్పకళా వేదిక ఆవరణలో బ్లేడ్ పట్టుకుని తిరుగుతున్న వ్యక్తి చిత్రాన్ని మీడియాకు అందించిన పోలీసులు అతని ఆచూకీ తెలిస్తే, 9493549415, 9491030063 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. గోపాల గోపాల ఆడియో వేడుక ఆవరణలో చేతిలో బ్లేడు పట్టుకుని తిరుగుతున్న వ్యక్తి ఫోటో ఒకటి హాట్ టాపిక్ అయింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానిపై ‘గోపాల గోపాల' ఆడియో వేడుక వద్ద దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. దాడి ఘటన తనను ఎంతగానో డిస్ట్రబ్ చేసింది. నేను స్వయంగా వెళ్లి కలుస్తాను. ఇలాంటి జరుకుండా చూడాలని రిక్వెస్ట్ చేసారు.

‘నిన్న ‘గోపాల గోపాల' ఆడియో వేడుకలో అభిమానిపై జరిగిన దాడి ఘనటన నన్ను ఎంతగానో డిస్ట్రబ్ చేసింది. అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన తర్వాత స్వయంగా వెళ్లి కలుస్తాను. భవిష్యత్తులో ఇలాంటి జరుగకుండా చూడాలని అభిమానులకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ సేఫ్టీ నాకు అత్యంత ముఖ్యమైన విషయం' అని ట్వీట్ చేసారు.
గోపాలగోపాల సినిమా ఆడియో ఫంక్షన్ హడావిడిలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఈ ఆడియో పంక్షన్ టికెట్లు ఇవ్వలేదని దుండగులు పవన్‌కల్యాణ్ అభిమాని గొంతు కోసి పారిపోయారు. ఈ ఘటన ఆదివారం శిల్పకళా వేదిక వద్ద జరిగింది. గుంటూరు జిల్లా గంటవారిపాలెంకు చెందిన కరుణ శ్రీనివాస్ (31) పవన్ కల్యాణ్ అభిమాన సంఘం వినుకొండ నియోజకవర్గం అధ్యక్షుడు. హయత్‌నగర్‌లోని గంటవారిపాలెంలో నివాసముంటున్నాడు. వెంకటేష్, పవన్‌కల్యాణ్ నటించిన గోపాల-గోపాల సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు సంబంధించిన 20 టికెట్లను వేదిక వద్ద తన స్నేహితులకిస్తుండగా దుండగులు వచ్చి తమకూ కావాలని అడిగారు. నిరాకరించిన శ్రీనివాస్ గొంతు, మెడపై బ్లేడ్‌తో దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో కుప్పకూలి న శ్రీనివాస్‌ను అక్కడే ఉన్న పోలీసులు మాదాపూర్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి ప్రాణహాని తప్పింది.