twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గబ్బర్ సింగ్' లో పవన్ వెరైటీ ఇంట్రడక్షన్

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్,హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న గబ్బర్ సింగ్ చిత్రంలో హీరో ఇంట్రడక్షన్ సీన్ ని డిఫెరెంట్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.కౌబాయ్ స్టైల్లో నాలుగు వందల షాట్స్ తో ఈ సీన్ చిత్రీకరిస్తున్నారని,అది హైలెట్ గా సినిమాలో నిలవబోతోందని చెప్తున్నారు.ఇక ఈ చిత్రంలో పవన్ చాలా స్టైలిష్ గా పంచ్ డైలాగులో అదరకొట్టి తన అబిమానులను ఆనందింపచేస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ కంటిన్యూగా యాభై రోజుల షెడ్యూల్ లో పాల్గొనటానికి ప్లాన్ చేసుకున్నారు. అక్టోబర్ పదవ తేది నుండి ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడు.

    ఆల్రెడీ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై పోయి కొన్ని పవన్ లేని సీన్స్ షూట్ చేసేస్తున్నారు. ఇక తమిళనాడులోని పొల్లాచ్చి ప్రాంతంలో ఈ షూటింగ్ జరుగుతోంది.అక్కడ జాయిన్ అవుతారు పవన్ కళ్యాణ్. యాభై రోజుల షెడ్యూల్ లో మాగ్జిమం టాకీ పార్ట్ అవకొట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ నటిని ఒప్పించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ రెండు పాటల రికార్టింగ్ పూర్తి చేసారు.

    ఇక దబాంగ్ రీమేక్ గా రూపొందుతోన్న గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మాత గణేష్ బాబు..ఎట్టి పరిస్దితుల్లోనూ సంక్రాంతికే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్, సుహాసిని, అభిమన్యు సింగ్, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

    English summary
    Director planning to shoot introduction of pawan kalyan in Gabbar Singh movie is a very diffrent way as like cowboy style with 400 shots in this scene.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X