twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుజరాత్ లో గబ్బర్ సింగ్ :పవన్ టీమ్ తో కలిసి ఇలా..(ఫొటో)

    By Surya
    |

    హైదరాబాద్ : పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్ సింగ్'. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ కోసం గుజరాత్ కు వెళ్లారు. అక్కడ టీమ్ తో కలిసి నడుస్తున్న ఫొటో ని శరద్ మరార్ రీసెంట్ గా తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసారు. ఆ ఫొటో ని మీరూ ఇక్కడ చూడండి.

    చిత్రం విశేషాలకు వెళ్తే...

    పవన్‌ కల్యాణ్‌ ఖాకీ కడితే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో 'గబ్బర్‌ సింగ్‌'లో చూశాం. 'నాక్కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది' అంటూ డైలాగులనే బులెట్లులా పేల్చారు అందులో. ఇప్పుడు మళ్లీ పవన్‌ కల్యాణ్‌ పోలీస్‌ అవతారం ఎత్తాడు. మరోసారి లాఠీ పట్టి హంగామా చేయబోతున్నాడు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాబీ దర్శకుడు. మొన్నటివరకూ ఈ ప్రాజెక్టు 'గబ్బర్‌సింగ్‌ 2' పేరు మీదే చలామణీ అయ్యింది. ఈ చిత్రానికి ఇప్పుడు సరికొత్త పేరు 'సర్దార్‌' పెట్టి ఫస్ట్ లుక్ , టీజర్ వదిలారు.

    gabbarsing 2

    నిర్మాత మాట్లాడుతూ ''ఈ సినిమా 'గబ్బర్‌సింగ్‌'కు సీక్వెలో ప్రీక్వెలో కాదు. ఇదో కొత్త కథ. పవన్‌ చిత్ర కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకొన్నారు. సినిమాలోని భావోద్వేగాన్ని ప్రతిఫలించేలా చిత్రం రూపొందిస్తున్నాం. దేవిశ్రీప్రసాద్‌ అందించిన బాణీలు ఆకర్షణగా నిలుస్తాయి''అన్నారు.

    'గబ్బర్‌ సింగ్‌ 2' విషయంలో అన్ని జాగ్రత్తలూ పవన్ తీసుకుంటున్నారు. ఆయన తన 'గబ్బర్‌ సింగ్‌ 2' కోసం ఓ నూతన నటుడ్ని ప్రతినాయకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేయబోతున్నారు. అతనే.. శరత్‌ కేల్కర్‌. ఈ మరాఠీ నటుడు 'గబ్బర్‌సింగ్‌ 2'తో ప్రతినాయకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు.

    gabbarsing

    ప్రతినాయకుడి పాత్రకు ఎంతోమందిని పరిశీలించి, ఫొటో షూట్‌లు చేసి.. చివరికి పవన్‌ కేల్కర్‌ని ఎంచుకొన్నారట. ఇటీవల ఇతనిపై కొన్ని సన్నివేశాల్నీ తెరకెక్కించారు. కేల్కర్‌ నటన పట్ల పవన్‌ చాలా సంతృప్తితో ఉన్నారని తెలిసింది. కేల్కర్‌కి తెలుగురాదు. అయినా సరే... తెలుగు నేర్చుకొని, తన డైలాగులను తనేపలికాడట.

    కేల్కర్‌ గొంతులో గాంభీర్యం, వృత్తిపై అతనికున్న శ్రద్ధ పవన్‌కి బాగా నచ్చాయని చిత్రబృందం చెబుతోంది. ఇటీవల హైదరాబాద్ లో రెండో షెడ్యూలు నైట్ షూటింగ్ లతో మొదలైంది. బాబి దర్శకతం వహిస్తున్న ఈ చిత్రానికి శరత్‌మరార్‌ నిర్మాత.

    నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌, కెమెరా: జయనన్‌ విన్సెంట్‌.

    English summary
    Pawan Kalyan's latest project Sardaar Gabbar Singh's new schedule is supposed to start from today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X