పవన్ పాడిన పాట క్రియేట్ చేసిన రికార్డ్
హైదరాబాద్ : పవన్‌కళ్యాణ్ మరోసారి తన గాత్రాన్ని వినిపించి తన అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న 'అత్తారింటికి దారేది' చిత్రం కోసం ఓ ప్రత్యేక గీతాన్ని పవన్ ఆలపించాడు. 'కాటం రాయుడా...కదిరి నరసింహుడా' అంటూ సాగే పాటను తివిక్రమ్, దేవిశ్రీప్రసాద్ దగ్గరుండి మరీ పవన్‌తో పాడించారు. ఈ పాట ఇప్పుడు ఇంటర్ నెట్ ప్రపచంలో ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇరవై నాలుగు గంటల్లోనే... యూ ట్యూబ్ లో ... 3,70,000 వ్యూస్ వచ్చాయి. ఇది పెద్ద రికార్డ్.
ఇక ఈ పాట ఇలా సాగుతుంది...
"కాటమ రాయుడా .... కదిరి నరసింహుడా .....
కాటమ రాయుడా .... కదిరి నరసింహుడా ...
కాటమ రాయుడా .... కదిరి నరసింహుడా ..
మేటైన ఏటగాడా నిన్నే నమ్మీతిరా
మేటైన ఏటగాడా నిన్నే నమ్మీతిరా
బేట్రాయి సామి దేముడా .. నన్నేలినోడ .... .బేట్రాయి సామి దేముడా ..
సేపకడుపు సీరి ముట్టిది రాకాసిగాను కోబాలు తీసి కొట్టిది
బేట్రాయి సామి దేముడా .. నన్నేలినోడ .... .బేట్రాయి సామి దేముడా ..
కోతిమన్ను నీళ్ళలోన ఎలసి ఏకమై తిరిగి
కోతిమన్ను నీళ్ళలోన ...
బాపనోళ్ళ చదువులల్ల బ్రహ్మదేవర కిచ్చినోడా ...
బాపనోళ్ళ చదువులల్ల బ్రహ్మదేవర కిచ్చినోడా ...
బేట్రాయి సామి దేముడా .. నన్నేలినోడ .... .బేట్రాయి సామి దేముడా ..
సేపకడుపు సీరి ముట్టిది రాకాసిగాను కోబాలు తీసి కొట్టిది
బేట్రాయి సామి దేముడా .. నన్నేలినోడ .... .బేట్రాయి సామి దేముడా .."
ఇక ఈ పాట సుమంగలి (1940) అనే పాత క్లాసిక్ చిత్రంలోంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ పాట లిరిక్స్ యాజటీజ్ గా ఇలాగే ఉన్నాయి. ఇక చిత్రం టైటిల్స్ లో ఈ విషయం ప్రస్తావిస్తారని భావిస్తున్నారు.

Click it and Unblock the Notifications