పవన్ పిల్లలిద్దరూ దీపావళి హడావిడిలో....(ఫొటో)
హైదరాబాద్: ఎల్లుడే దీపావళి. దేశమంతటా అప్పుడే దీపావళి సంబరాలు మొదలైపోయాయి. ముఖ్యంగా పిల్లలు ఈ సంబరాలకు బాణాసంచాను రెడీ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల పిల్లలు అకిరా నందర్, ఆధ్యలు కూడా ఇదిగో ఇలా దీపావళి కి చెందిన చిచ్చుబుడ్లు తయారీలో బిజీగా ఉన్నారు. చాలా మంది సెలబ్రెటీల పిల్లల్లా బాణాసంచాను కొనకుండా తమకు తామే తమ ప్రెండ్స్ తో కలిసి ఇలా తయారు చేసుకోవటం ముచ్చట గొలిపే అంశమే కదా.
ఇక అకిరా నందన్ విషయానికి వస్తే...ఈ జూనియర్ పవర్ స్టార్ ఓ గెస్ట్ రోల్ లో కనపించటానికి సిద్దమవుతున్నాడు. తన తల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అది. 'ఇష్క్ వాలా లవ్' చిత్రం కథ,మాటలు స్వయంగా రేణునే అందించి తెరకెక్కించింది. ఈ కథ ఓ జంట కు చెందింది. ఇందులో ఓ సెంటిమెంటల్ కుర్రాడికి, క్రేజీ అమ్మాయికి జరిగే లవ్ స్టోరీ. ఈ పాత్రల వైరుధ్యాలే చిత్రానికి ప్రాణం అని చెప్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్బింగ్ చేయనుంది. ఇందులో ఓ స్పెషల్ ఎట్రాక్షన్ ఉంది. అది మరేదో కాదు...ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌ల కుమారుడు అకిరా నందన్ ముఖానికి రంగేసుకున్నాడు. తన తల్లి రేణుదేశాయ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మరాఠీ చిత్రం 'ఇష్క్ వాలా లవ్'లో అకిరా అతిథి పాత్రల్లో మెరవబోతున్నాడు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రేణుదేశాయ్ ట్విట్టర్‌లో ద్వారా ప్రకటించారు.
''నేను ముందుగా మాట ఇచ్చినట్లు ఈ రోజు తీపి కబురు చెబుతున్నా. నా కొడుకు అకిరా నందన్ 'ఇష్క్ వాలా లవ్'లో అతిథి పాత్ర పోషిస్తున్నాడు. ఓ తల్లిగా నా కొడుకుని డైరక్ట్ చేయడం ఆనందంగా ఉంది'' అంటూ రాసుకొచ్చారు రేణు దేశాయ్. ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తామని ఇదివరకే రేణు దేశాయ్ చెప్పారు. అంటే అకిరా నటనను తెలుగు తెరపైనా చూసే అవకాశముంది.


Click it and Unblock the Notifications











