కుటుంబ బంధాలకూ... పవన్ 'అత్తారింటికి దారేది'
హైదరాబాద్ : పవన్ కల్యాణ్ సినిమా అంటే యూత్ లో విపరీతమైన క్రేజ్. దానికి తగ్గట్లో పవన్ ..ప్రతీ సినిమాకూ వేరియేషన్ చూపించుతూ ముందుకు వెళ్తున్నారు. ఆయన చిత్రాల్లో ఎంటర్టైన్మెంట్ కి ఎంత స్థానముంటుందో.. పైట్స్ కు అంతే ప్రాధాన్యం ఉంటుంది.
ఈ రెండింటినీ 'జల్సా'లో పవన్‌తో చేయించారు త్రివిక్రమ్. ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో చిత్రం రూపొందుతోంది. ఇందులో పవన్ సరసన సమంత, ప్రణీత నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ స్పెయిన్‌లో జరుగుతోంది.
హీరో,హీరోయిన్స్ పై సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. వినోదంతోపాటు కుటుంబ బంధాలకూ సినిమాలో చోటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకి 'అత్తారింటికి దారేది' అనే పేరు పరిశీలనలో ఉంది. సహ నిర్మాతలు: భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, సంగీతం: దేవిశ్రీప్రసాద్.
More from Filmibeat
pawan kalyan brahmanandam samantha trivikram praneetha పవన్ కళ్యాణ్ సమంత త్రివిక్రమ్ ప్రణీత బ్రహ్మానందం


Click it and Unblock the Notifications












