twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ పిల్లలు దీపావళి గ్రీటింగ్స్ చెప్తూ...(ఫొటో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్,రేణు దేశాయ్ ల పిల్లలు అకిరా నందన్, ఆద్యలు ఇలా తమ అభిమానులకు, శ్రేయాభిలాషులకు శుభాకాంక్షలు తెలియచేసారు. హ్యాండ్ మేడ్ గ్రీటింగ్స్ తో ఇలా విషెష్ ని చెప్పారని రేణు దేశాయ్ ఈ ఫొటోని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి తెలియచేసింది. ఆమె పోస్ట్ చేసిన ఫొటోనే మీరు చూస్తున్నది...

    ఇక అకిరా నందన్ విషయానికి వస్తే...ఈ జూనియర్ పవర్ స్టార్ ఓ గెస్ట్ రోల్ లో కనపించటానికి సిద్దమవుతున్నాడు. తన తల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అది. 'ఇష్క్‌ వాలా లవ్‌' చిత్రం కథ,మాటలు స్వయంగా రేణునే అందించి తెరకెక్కించింది. ఈ కథ ఓ జంట కు చెందింది. ఇందులో ఓ సెంటిమెంటల్ కుర్రాడికి, క్రేజీ అమ్మాయికి జరిగే లవ్ స్టోరీ. ఈ పాత్రల వైరుధ్యాలే చిత్రానికి ప్రాణం అని చెప్తున్నారు.

    Pawan's Son-Daughter Unique Diwali wishes

    ఇక ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్బింగ్ చేయనుంది. ఇందులో ఓ స్పెషల్ ఎట్రాక్షన్ ఉంది. అది మరేదో కాదు...ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌, రేణు దేశాయ్‌ల కుమారుడు అకిరా నందన్‌ ముఖానికి రంగేసుకున్నాడు. తన తల్లి రేణుదేశాయ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మరాఠీ చిత్రం 'ఇష్క్‌ వాలా లవ్‌'లో అకిరా అతిథి పాత్రల్లో మెరవబోతున్నాడు. ఈ విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా రేణుదేశాయ్‌ ట్విట్టర్‌లో ద్వారా ప్రకటించారు.

    ''నేను ముందుగా మాట ఇచ్చినట్లు ఈ రోజు తీపి కబురు చెబుతున్నా. నా కొడుకు అకిరా నందన్‌ 'ఇష్క్‌ వాలా లవ్‌'లో అతిథి పాత్ర పోషిస్తున్నాడు. ఓ తల్లిగా నా కొడుకుని డైరక్ట్‌ చేయడం ఆనందంగా ఉంది'' అంటూ రాసుకొచ్చారు రేణు దేశాయ్‌. ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తామని ఇదివరకే రేణు దేశాయ్‌ చెప్పారు. అంటే అకిరా నటనను తెలుగు తెరపైనా చూసే అవకాశముంది.

    అలాగే ఆమె మాట్లాడుతూ... కల్యాణ్‌బాబు ఒకటే చెప్పారు.. ‘ఏదైనా సమస్య ఉంటే నేనున్నాను' అని. నిర్మాతగా నా మొదటి సినిమాకు ఎలాంటి సమస్యా రాలేదు. అలాగే ఇప్పుడు ‘ఇష్క్‌ వాలా లవ్‌'ను కూడా ఇప్పటి దాకా ఎలాంటి సమస్య లేకుండా హాయిగా పూర్తిచేశాం. మరాఠీలో మంచి డిస్ట్రిబ్యూటర్స్‌ రిలీజ్‌ చేశారు. తెలుగులో కూడా బాగా రిలీజ్‌ కాబోతోంది. ప్రస్తుతం ఆయన సపోర్ట్‌ తీసుకోవాల్సిన అవసరం కనిపించలేదు అన్నారామె.

    English summary
    Renuudesai tweeted:"Wishing all our fans&well wishers a very happy Diwali.(handmade greeting by Aadya&Akira) #support#organic#diwali"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X