నితిన్ సినిమాలో పవన్ కళ్యాణ్ సాంగ్ రీమిక్స్

By Srikanya

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అంటే నితిన్ కి వీరాభిమానం అన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఇష్క్ పంక్షన్ కి... పవన్ ని అతిధిగా ఆహ్వానించిన నితిన్ ఈ సారి ..ఏకంగా పవన్ పాటనే తన కొత్త సినిమాలో రీమిక్స్ చేయనున్నారు. తొలిప్రేమ చిత్రంలోని...ఏమైందో ఏమో ఈవేళ సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నితిన్ ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు.

ఆ ట్వీట్ ఏమిటంటే...' మా సినిమాలో ఈ పాటే హైలెట్ అవుతుంది. అలాగే ఈ పాటను ఎంచుకోవటం ఓ ఛాలెంజ్ మాకు. కానీ ఎవరినీ డిజప్పాయింట్ చేయకుండా,అందరూ మెచ్చుకునేలా రీమిక్స్ చేస్తాం.. ' అని ట్విట్ చేసారు. ఇక ఈ చిత్రం టైటిల్ 'గుండె జారి గల్లంతయ్యిందే' . ఈ టైటిల్ కూడా పవన్ గబ్బర్ సింగ్ లోని ఓ పాట చరణం నుంచి ప్రేరణ పొంది పెట్టుకున్నదే కావటం విశేషం.

నితిన్, నిత్యా మీనన్ జంటగా 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా విజయ్ కుమార్ కొండ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సుధాకర్ రెడ్డి నిర్మాత. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బేసిక్‌గా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నితిన్, పవన్ లేటెస్ట్ హిట్ 'గబ్బర్‌ సింగ్' చిత్రంలోని ఓ పాటలోని లిరిక్ అయిన 'గుండె జారి గల్లంతయ్యిందే'ని టైటిల్‌గా పెట్టుకొని ఈ సినిమా చేస్తున్నాడు.

'ఇష్క్' చిత్రంలో తనతో జోడి కట్టిన నిత్య మీనన్‌ నితిన్‌తో కలిసి మరోసారి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే... బ్యాట్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా ఈచిత్రంలో ప్రత్యేక గీతం(ఐటం సాంగ్)లో కనిపించనుంది. ఈ సినిమాతో ఆమె సినిమా రంగంలోకి ఎంటరవుతోంది. ఈ విషయాన్ని జ్వాలా గుత్త ఇటీవల స్వయంగా వెల్లడించింది.

ఇష్క్ చిత్రానికి విజయవంతమైన మ్యూజిక్ అందించిన అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్ర ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో ఇషా తల్వార్, మధు నందన్, రఘుబాబు, తాగబోతు రమేష్, అలీ, ఆహుతి ప్రసాద్, సుధ, సంధ్యా జనక్ నటిస్తున్నారు. సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఆండ్రూ బాబు.ఐ, ఎడిటర్: ప్రవీన్ పూడి, లిరిక్స్: కృష్ణ చైతన్య, శ్రీమణి, ఆర్ట్స్ రాజీవ్ నాయర్, మాటలు-స్క్రీన్ ప్లే: హర్ష వర్ధన్, నిర్మాత: నిఖితా రెడ్డి, కథ-దర్శకత్వం: విజయ్ కుమార్ కొండ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X