పవన్ ‘సరదా’ టైటిల్ పోస్టర్ హల్‌చల్!
హైదరాబాద్: జల్సా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మళ్లీ నటిస్తుండటంతో ఆ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. త్వరలో ప్రారంభోత్సవం జరుపుకోనున్న ఈచిత్రానికి 'సరదా' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ మాత్రం ఇటీవల మీడియాతో మాట్లాడుతూ టైటిల్ ఖరారు కాలేదని స్పష్టం చేసారు.
తాజాగా 'సరదా' టైటిల్ పోస్టర్ హల్ చల్ చేస్తుండటంతో అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పేజీలో కూడా ఇది దర్శనం ఇస్తుండటంతో ఇది... అఫీషియల్ టైటిలా, కాదా అనే కన్ ఫ్యూజన్ కు తెరలేచినట్లయింది. మరి ఈ టైటల్ అసలుదా? నకిలీదా? అనేది త్వరలో తేలనుంది.
కాగా.. ఈ నెల 23న హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంచనంగా ప్రారంభమవుతుందని. అయితే, రెగ్యులర్ షూటింగు మాత్రం వచ్చే నెల నుంచి జరుగుతుందని తెలుస్తోంది. అధికారికంగా ఈ విషయం ఖరారు కావాల్సి ఉంది. సమంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంపికయినట్లుగా ఫిల్మ్ నగర్ సమాచారం. పవన్ సినిమా కారణంగానే రామ్ చరణ్ 'ఎవడు'లో ఆమె అవకాశం కోల్పోయిందనే ప్రచారం కూడా జరిగింది.
పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో జల్సా సినిమా వచ్చింది. జల్సా కలెక్షన్లను కురిపించింది. దీంతో త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్‌కు సమంత తోడు కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించనున్నారు.


Click it and Unblock the Notifications











