సర్కార్ చిత్రాన్ని టార్గెట్ చేయకుండా ఊరుకుంటారా.. సినిమాలపై హింట్ ఇచ్చిన పవన్!

Recommended Video

Pawan Kalyan Will Act In Movies Again...? | Filmibeat Telugu

రాజకీయ కార్యక్రమాలతో బిజీగా పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. క్షణం తీరిక లేకుండా గోదావరి జిల్లాలని చుట్టేస్తున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో సినిమాలు చేస్తారా చేయరా అనే చర్చ జరుగుతూనే ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీని పక్కన పెట్టి సినిమాలు చేయడం సాధ్యం కాదు. తనకు సినిమాలు చేసే తీరిక లేదంటూ పవన్ అధికారికంగా ప్రకటించారు కూడా. చెన్నై వెళ్లిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నారు. అదేవిధంగా నిన్న పి గన్నవరం బహిరంగ సభలో భవిష్యత్తులో సినిమాలు చేసే విషయంపై పవన్ హింట్ ఇచ్చారు.

సర్కార్ వివాదం

సర్కార్ వివాదం

ఈ ఏడాది అత్యంత వివాదభరిత చిత్రాల్లో ఒకటిగా సర్కార్ నిలిచింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఓ విమర్శగా తీసుకోలేని అన్నా డీఎంకే పార్టీ పెద్ద గొడవ చేసింది. ఫలితంగా సర్కార్ కాంట్రవర్షియల్ మూవీగా నిలిచింది. విజయ్ నటించిన మెర్సల్ తరువాత సర్కార్ కూడా వివాదభరితం కావడం హాట్ టాపిక్. తమ పార్టీ ప్రతిష్టని దిగజార్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అన్నా డీఎంకే పార్టీ కార్యకర్తలు, నేతలు ఆగ్రహంతో ఊగిపోయారు.

చెన్నె వేదికగా

చెన్నె వేదికగా

ఇటీవల పవన్ కళ్యాణ్ చెన్నై పర్యటించిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ సర్కార్ చిత్రం గురించి స్పందించారు. పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వివాదాలు సృష్టించేవారికి ఎప్పుడూ సినిమానే సాఫ్ట్ టార్గెట్. అలాంటిది సర్కార్ చిత్రాన్ని టార్గెట్ చేయకుండా వాళ్ళు ఊరుకుంటారా.. వాళ్ళ నైజం అంటూ పవన్ వ్యాఖ్యానించారు.

నా చిత్రాలు కూడా

నా చిత్రాలు కూడా

గతంలో నా చిత్రాలు కూడా ఇలాంటి తరహా వివాదంలో చిక్కుకున్నాయని పవన్ తెలిపాడు. తెలంగాణ ఉద్యమ సంయమలో విడుదలైన కొమరం పులి చిత్రంలో పెద్ద వివాదం సాగిన సంగతి తెలిసిందే. నా చిత్రాల్లో చిన్న డైలాగ్ ఉంటేనే నానా రచ్చ చేసారని పవన్ వ్యాఖ్యానించారు. సర్కార్ చిత్రంలో సమస్యలపై పోరాటాన్ని చూపించారు. అలాంటి పోరాటాలు నిజజీవితంలో చేయాలనే రాజకీయాల్లోకి వచ్చినట్లు పవన్ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.

సినిమాలపై హింట్

సినిమాలపై హింట్

ఇదిలా ఉండగా తాను భవిషత్తులో సినిమాల్లో నటించే విషయమై బహిరంగ సభలో మాట్లాడుతూ పవన్ హింట్ ఇచ్చారు. ఇటీవల సినిమా చేసి పెట్టమని కొందరు తెలిసిన వాళ్ళు వచ్చారని పవన్ తెలిపారు. పార్టీకి డబ్బు అవసరమైతే సినిమాలు చేసిపెట్టమని నా బంధువులు, స్నేహితుల్లో కొందరిని అడిగానంటూ పవన్ తెలిపాడు. ఎంజీఆర్ కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు పార్టీ అవసరాల కోసం సినిమాలు చేసేవారని పవన్ తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X