'కొమురం పులి' నిమిత్తం పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునేషన్ అంటూ ఓ ఫిగర్ చిత్ర పరిశ్రమలో రౌండ్స్ తిరిగుతోంది. అది మరెంతో కాదు...తొమ్మిది కోట్లు. విన్నవారు ఆశ్చర్యపోయేలా ఉన్న ఈ అంకె నిజమే అయితే సౌత్ లో ఇంత రెమ్యునేషన్ తీసుకునే నటుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత పవనే అంటున్నారు. ఇక నిజానిజాలు ఎలా ఉన్నా జల్సా రికార్డ్ కలెక్షన్ కి ఆ మాత్రం రెమ్యునేషన్ ఇవ్వటం సమంజసమే అంటున్నారు పరిశ్రమ ట్రేడ్ వర్గాలు. అలాగే ఖుషి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రెడీ అవుతున్న చిత్రం కావటం రెమ్యునేషన్ పెర్గటానికి మరో కారణం అంటున్నారు. అంతేగాక రికార్డ్ స్ధాయిలో ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవటం కూడా దీనికి ప్లస్ అయ్యే అంశం అంటున్నారు. ఇవన్నీ ప్రక్కన పెడితే పవన్ కున్నంత ఓపినింగ్స్ ,హిట్ ప్లాప్ లతో సంభందం లేకుండా కలెక్షన్స్ కురవటం ఆ రెమ్యునేషన్ ని జస్టిఫై చేసే అంశాలు.