పవన్ కళ్యాణ్-డైరెక్టర్ శంకర్ జంటగా రచ్చ ఆడియో

By Bojja Kumar

మెగా వారసుడు రామ్ చరణ్ తేజ-తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న 'రచ్చ' సినిమా ఆడియో ఫిబ్రవరి 26న కర్నూలులో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ చేతుల మీదుగా ఈ చిత్ర ఆడియోను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కర్నూలోని ఎస్.టి.బి.బి.సి కాలేజ్ గ్రౌండ్స్ రచ్చ ఆడియో వేడుకకు వేదిక కానుంది. ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఫంక్షన్ ప్రారంభం కానుంది. మణి శర్మ ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు అందించారని యూనిట్ సభ్యులు అంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటించి 'గ్యాంగ్ లీడర్' 100 రోజుల వేడుక కర్నూలులోనే జరిగింది. మళ్లీ సరిగ్గా 21 సంవత్సరాల తర్వాత మెగా కుటుంబానికి సంబంధించిన సినిమా వేడుక ఇక్కడ జరుగుతుండటంతో స్థానిక మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఒకే వేదికపై పవన్ స్టార్, డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ తేజ, తమన్నా లాంటి స్టార్లు వస్తుండటంతో అభిమానుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు అందుకు తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి నిర్మాతలు : ఎన్వీ ప్రసాద్‌, పారాస్‌జైన్‌, సమర్పణ: ఆర్‌.బి.చౌదరి, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి.

ఈ చిత్రానికి సంబంధించిన సాంగు ఒకటి నెట్ లో ఇప్పటికే లీకైంది. "సైలెంట్ చూపులోడు...వైలెంట్ చేతలోడు ...కరెంట్ కండలోడు..హీ ఈజ్ ద మిస్టర్ తీస్ మార్ ఖాన్ ...రచ్చ...అడుగేస్తే సీడెడ్..ఆంధ్రా..నైజాం..రచ్చ...వీడు రెచ్చిపోతే ఖచ్చితంగా రచ్చ..హీఈజ్ గోయింగ్ టుబి ఎ మెగాస్టార్...హీఈజ్ గోయింగ్ టు బి ఎ గెగా స్టార్.. హీ ఈజ్ గోయింగ్ టు బి ఎ యుగా స్టార్..అంటూ మాస్ బీట్ తో ఈ సాంగ్" అంటూ ఈ పాట సాగుతుంది. ఈ సాంగ్ లో...బాలీవుడ్ లో'రాస్కెల్స్‌','ఆయేషా'చిత్రాలలో హీరోయిన్ గా చేసిన లీసా హైడెన్‌ రామ్ చరణ్ తో డాన్స్ చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X