నోట్ల రద్దుపై పవన్ షేర్ చేసిన హృద్యమైన కవిత ఇదిగో

ప్రధాని నరేంద్రమోదీ ఆకస్మికంగా ప్రకటించిన పెద్దనోట్ల రద్దుపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌లో ఓ కవితను షేర్ చేసి తన స్పందన తెలియచేసారు. ఈ కవిత అంతటా చర్చనీయాంశంగా మారింది.

By Srikanya

హైదరాబాద్‌: నల్లధనం, అవినీతి నిర్మూలనకు పెద్దనోట్లు రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చే ఫలితాలు భవిష్యత్‌ తరాలు పొందుతాయని బిజేపీ నాయకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్రమోదీ ఆకస్మికంగా ప్రకటించిన పెద్దనోట్ల రద్దుపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌లో స్పందించటం అంతటా చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపధ్యంలో కొత్త కరెన్సీపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అసంఘటిత పట్టణ మార్కెట్‌ సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

సీనియర్‌ సిటిజన్స్‌ గురించి కూడా పట్టించుకోవాలన్నారు. ప్రజల్లో అశాంతిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు పెద్దనోట్ల రద్దుపై సామాన్యుడి స్పందన తెలియజేసే ఓ అద్భుతమైన కవితను పవన్‌ కల్యాణ్‌ షేర్‌ చేసుకున్నారు. సినీ రచయిత సాయిమాధవ్‌ దీనిని రాశారు.

'మెతుకూ మెతుకూ కూడబెట్టి ముద్దపోగేస్తే
దొంగ కూడంటున్నారన్నా నేనెట్టా బతికేది?

కన్నీటి బొట్టూ బొట్టూ దాపెట్టి ఏడుపు పోగేస్తే
నా ఏడుపు చెల్లదంటున్నారన్నా నేనెట్టా చచ్చేది'

పెద్దనోట్ల రద్దుతో సామాన్యుడు పడుతున్న కష్టాలకు అద్దంపట్టేలా సాయిమాధవ్‌ రాసిన ఈ హృద్యమైన ఈ కవిత ఇప్పుడు సోషల మీడియాలో తెగ షేర్లు అవుతోంది. నెటిజన్లను కదిలించి ఆలోచింప చేసేలా చేస్తోంది.

పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ఆయన హీరోగా డాలి దర్శకత్వంలో కాటమరాయుడు అనే చిత్రం రూపొందుతోంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీ అది. తమిళంలో విజయవంతమైన వీరమ్ చిత్రానికి రీమేక్ అని తెలుస్తోంది. ఈ చిత్రం పూర్తి ఫన్ తో ఎంటర్టైన్మెంట్ తో సాగనుంది.

Pawan Shared a Poem in twitter

ఓ ప్రక్కన వీరమ్ చిత్రం రీమేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ..అదే అజిత్ నటించిన మరో తమిళ సినిమా వేదాలం రీమేక్ సైతం చేస్తున్నారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు నేశన్ డైరక్ట్ చేస్తారు. ఇప్పటికే ఈ చిత్రం లాంచింగ్ జరిగింది. తెలుగు నేటివిటికి తగ్గట్లుగా మార్పులులో ఈ చిత్రం తెరకెక్కనుంది.

పవన్ ఈ రెండు చిత్రాలతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో చిత్రం లాంచ్ చేసారు. నిర్మాత చినబాబు బ్యానర్ లో ఈ చిత్రం రూపొందనుంది. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల సక్సెస్ తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే మంచి క్రేజ్ వస్తుంది మార్కెట్ లో అని భావిస్తున్నారు.

ఇక ఈ సినిమాలతో పాటు తన బ్యానర్ తన వీరాభిమాని నితిన్ హీరోగా ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య డైరక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ మూల కథ అందిస్తున్నారు. ఈ దర్శకుడు గతంలో నారా రోహిత్ తో రౌడి ఫెలో అనే చిత్రం డైరక్ట్ చేసి ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X