చివరి దశలో పవన్ అత్తారింటికి.., ఈనెల్లోనే డబ్బింగ్!
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది' చిత్రం టాకీపార్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలో పవన్ డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాడు. యూనిట్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ నెలాఖరు కల్లా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 7వ తేదీన విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జల్సా తరహాలో ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజం, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు సినిమాకు హైలెట్ కానున్నాయి. 'జల్సా' చిత్రానికి ఈ చిత్రం డబల్ డోస్‌లా ఉంటుందట. ఈ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమా ఖరారైంది. సంపత్ నంది దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్-2'చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











