కన్ఫూజ్ అవుతున్న పవన్ కళ్యాణ్ సంట్ మాస్టర్...
ప్రముఖ స్టంట్ మాస్టర్ విజయన్...రీసెంట్ గా కొమురం పులి చిత్రం గురించి అన్ని చోట్లా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి సమకూర్చిన స్టంట్స్ చాలా అతిగా ఉన్నాయని, ఓపినింగ్ ఫైట్..హెలీకాప్టర్ జంప్స్, పెద్ద బిల్డింగ్ ల మీదకు దూకటం, అలాగే క్లైమాక్స్ ఫైట్ చూసి పెదవి విరుస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఇవే ఫైట్స్ ఆయన సల్మాన్ ఖాన్ తాజా చిత్రం..దబాంగ్ కోసం సమకూర్చారు. అందులోనూ హీరో పోలీస్ అదికారి. దరిదాపు రెండు చిత్రాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. అటు చూస్తే దబాంగ్..నూట యాభై కోట్లు కలెక్టు చేసింది. ఇటు పులి చిత్రం ధియోటర్స్ ని దాటి పోయింది. దాంతో విజయన్...ఏమిటీ వేరియేషన్...ప్రేక్షకుల్లో తేడానా..ప్రెజెంటేషన్ లో వైవిధ్యమా అని కన్ఫూజ్ అయి తన తోటి వారితో ఈ విషయమై చర్చించాడని తెలుస్తోంది. ఇంతకీ లోపమెక్కడ జరిగిందీ అన్న విషయం ఎస్ జె సూర్యని అడిగితే తెలిసిపోతుందని కొందరు సలహా ఇచ్చారుట. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











