‘కెమెరామెన్ గంగతో..’ పవన్-తమన్నా ఫస్ట్ లుక్

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తాజాగా చేస్తున్న చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. ఈచిత్రంలో పవన్, తమన్నా ఎలాంటి గెటప్‌లలో కనిపిస్తారనే ఆసక్తి మొదటి నుంచీ అభిమానుల్లో నెలకొంది. ఆ మధ్య పవన్ కళ్యాణ్‌కు సంబంధించి ఫోటో ఒకటి బయటకు లీకవ్వగా...తాజాగా తమన్నా లుక్ కూడా కనిపించింది.

ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. తమన్నా గంగ పాత్రలో మీడియాకు చెందిన వ్యక్తిగా నటిస్తోంది. ఫోటోలో తమన్నా గెటప్ చూడండి...మెడలో ట్యాగ్‌తో మైకు పట్టుకుని తిరిగే ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా ఉంది కదూ...

ఆమె పాత్ర మెకానిక్‌గా ఉండే పవన్ తో కలిసి సమాజానికి పనికివచ్చే పనులు చేస్తుందని సమాచారం. సమాజంలో జరిగే దారుణాలను ప్రజల ముందుకు తీసుకురావడంలో రాంబాబు(పవన్) గంగ(తమన్నా)కు సహకరిస్తాడని తెలుస్తోంది. ఈ పాత్ర పవన్ కెరీల్ లో ఓ కొత్త యాంగిల్ లో మాస్ నచ్చేలా ఉంటుందని సమాచారం.

యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈచిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యాం కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, నిర్మాత: డి.వి.వి.దానయ్య, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X