నిన్న...నేడు..ప్రేమ (పవన్ 'తీన్ మార్' ప్రివ్యూ)
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్ మార్ ఈ రోజే(గురువారం)విడుద అవుతోంది.బాలీవుడ్ హిట్ లవ్ ఆజ్ కల్ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం మరో ఖుషీ అవుతుందని అంతా ఎక్సపెక్ట్ చేస్తున్నారు. కథ ప్రకారం..విదేశాల్లో చదువుకొంటూ ఉండే మైఖేల్ వేలాయుధం (పవన్ కల్యాణ్)కి ప్రేమ మీద ఖచ్చితమైన అభిప్రాయాలుంటాయి. స్వచ్ఛమైన ప్రేమ, ప్రేమ కోసం త్యాగం చేయడం ఇవన్నీ బరువైన పదాలని అనుకొంటాడు. లైలా మజ్నూలు, దేవదాస్ పార్వతిలు కథల్లో తప్ప నిజ జీవితంలో ఉండరని అతను చెప్తూంటాడు. అలాంటి మైఖేల్‌కి మిక్కీ (త్రిష)పడుతుంది. ఆమె వ్యక్తిత్వం, ఆలోచనలు పూర్తిగా మైఖల్ కి రివర్స్. అయితే ఇద్దరూ ఒకరికొకరు ఎట్రాక్ట్ అవుతారు. అప్పుడు ఆ జంట ఎదుర్కొన్న సమస్య ఏమిటి..ఇద్దరి మధ్య ప్రేమ మీద మైఖేల్ ఎలా అభిప్రాయం మారింది అనేదే కీలకం. అలాగే ముఫ్ఫె యేళ్ల క్రితం కాశీలో అర్జున్ పాల్వాయ్ (పవన్ కల్యాణ్) ప్రేమకథ ఎలాంటిది అనేది కూడా ఇంట్రష్టింగ్ నడుస్తుంది. ఈ కథలో పవన్ స్నేహితుడుగా సేనాపతి (పరేష్‌రావల్) పాత్ర కూడా కీలకమే.
సంస్థ: పరమేశ్వర ఆర్ట్స్
నటీనటులు: పవన్ కల్యాణ్, త్రిష, కృతి కర్బంద, పరేష్ రావల్, సోనూసూద్, ముఖేష్ రుషి, అలీ, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ల భరణి తదితరులు
మాటలు: త్రివిక్రమ్
నిర్మాత: గణేష్ బాబు
దర్శకత్వం: జయంత్ సి.పరాన్జీ
విడుదల: గురువారం.


Click it and Unblock the Notifications











