twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డిసెంబరులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పంజా’...!?

    By Sindhu
    |

    పవన్‌ కళ్యాణ్, విష్ణువర్థన్ కాంబినేషన్‌ లో రూపొందుతోన్న చిత్రానికి 'పంజా"అనే టైటిల్‌ని నిర్ణయించారు. గత కొన్నాళ్లుగా రకరకాల పేర్లు తెరపైకి రావడం..ఆ వెంటనే 'మా టైటిల్ అది కాదు' అంటూ నిర్మాతలు ఖండించడం జరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో పేర్లు పరిశీలించిన మీదట ఆఖరికి పవన్ కల్యాణ్ ఈ 'పంజా' టైటిల్ని తాజాగా ఓకే చేశాడు. సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియావర్క్స్ సంయుక్త నిర్మాణంలో నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ 'పవన్ మాస్ ఇమేజ్‌ ను దృష్టిలో పెట్టుకొని 'పంజా" అనే పవర్‌ ఫుల్ టైటిల్‌ ని నిర్ణయించాం.

    కలకత్తా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ ఇది. తమిళంలో స్టయిలిష్ డైరెక్టర్‌ గా పేరు తెచ్చుకున్న విష్ణువర్థన్ ఈ సినిమాని న్యూలుక్‌ తో ప్రెజెంట్ చేశారు. ఈనెల 10 నుంచి బ్యాలెన్స్ పాటలను చిత్రీకరిస్తాం. దీపావళికి ఫస్ట్ ట్రైలర్‌ ను విడుదల చేసి నవంబరులో ఆడియోను, డిసెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం. తమిళంలో కూడా 'పంజా"ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. సారాజేన్ డయాస్, అంజిలీ లావానియా నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, సంగీతం: యువన్‌శంకర్ రాజా, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, కెమెరా: పీఎస్ వినోద్, ఆర్ట్: సునీల్‌బాబు.

    English summary
    Pawan Kalyan's ongoing flick is currently being shot in Ramoji film city. A song is being shot on Pawan and Sarah. Sara Jane dias and Anjali 
 
 Lavania are the heroines. Vishnuvardhan is directing the film and Shobu Yarlagadda and Neelima under Sanghamitra Arts and Arka Media banners with cinematography by P S Vinod and music by Yuvan Shankar Raja. There were many speculations about the title of the 
 
 movie.However our sources close to Pawan Kalyan say that the makers are considering 'Panja' as the title of the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X