అలీతో పవన్ కళ్యాణ్ సెలబ్రేషన్ (ఫోటో)

By Srikanya

హైదరాబాద్ : తెరపై నవ్వులు పూయిస్తున్న అలీకి అకాడెమీ ఆఫ్‌ యూనివర్శల్‌ గ్లోబ్‌ పీస్‌ సంస్థ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయబోతోంది. ఈ విషయం తెలిసి అలీని ప్రముఖ హీరో పవన్‌కల్యాణ్‌ అభినందించారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో 'అత్తారింటికి దారేది?' చిత్రీకరణ సాగుతున్న సమయంలో ప్రత్యేకంగా కేక్‌ తెప్పించి సందడి చేయించారు. ఈ సందర్భంగా అలీని దర్శకుడు త్రివిక్రమ్‌, నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ అభినందించారు. ఈ నెల 25న తమిళనాడులోని కోయంబత్తూరులో గౌరవ డాక్టరేట్‌ తీసుకొంటారు.

అలీ మాట్లాడుతూ ''బాల నటుడిగా సినీ జీవితం మొదలైంది. నటుడిగా నా అనుభవంతోపాటు గత అయిదేళ్లుగా నా తండ్రి పేరున స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహిస్తున్నాను. ఆ కార్యకలాపాల్నీ గుర్తించి ఈ పురస్కారం అందిస్తున్నారు''అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X