»   » పవన్ కళ్యాణ్ పడుతున్న కష్టం గురించి తెలుసా మీకు?

పవన్ కళ్యాణ్ పడుతున్న కష్టం గురించి తెలుసా మీకు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఏదైనా పని పూర్తి చేయడం కోసం అలుపు లేకుండా కష్టపడుతుంటే... గొడ్డులా కష్టపడుతున్నాడని అంటుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఇలానే కష్టపడాలని నిర్ణయించుకున్నారు తన తాజా సినిమా కోసం.

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉండటంతో.... ఎప్పుడు ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనాల్సి వస్తుందో, ఎప్పుడు షూటింగుకు బ్రేక్ ఇవ్వాల్సి వస్తుందో తెలియని పరిస్థితి.

రోజూ 12 గంటల కష్టపడుతున్న పవర్ స్టార్

రోజూ 12 గంటల కష్టపడుతున్న పవర్ స్టార్

తనకు ఉన్న సమయాన్ని పూర్తి స్తాయిలో సద్వినియోగం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. సినిమా పూర్తయ్యే వరకు రోజూ 12 గంటల పాటు కష్టపడాలని నిర్ణయించుకున్నారు.

టార్గెట్ ఆగస్టు 11

టార్గెట్ ఆగస్టు 11

ఎలాగైనా ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. అప్పటి వరకు సినిమాను పూర్తి చేసిన రిలీజ్ చేయాలని, ఆ డేట్ మిస్ అయితే.... మంచి అవకాశం మిస్సవుతుందనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ ఉందట.

ఆ రోజే విడుదల ఎందుకు?

ఆ రోజే విడుదల ఎందుకు?

ఆగస్టు 11 శుక్రవారం.... ఆగస్టు 15 సెలవు. వీకెండ్ తో కలుపుకుంటే మొత్తం 5 రోజులు హాలిడేస్. ఈ సమయంలో రిలీజ్ చేస్తే ఆడియన్స్ ఎక్కువగా వస్తారు, ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఎక్కువగా వచ్చి చూస్తారు అనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.

రూ. 150 కోట్ల బిజినెస్ అంచనాలు

రూ. 150 కోట్ల బిజినెస్ అంచనాలు

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ కాబట్టి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అన్ని ఏరియాలు కలిపి థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ. 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

బడ్జెట్

బడ్జెట్

ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ కాకుండానే ప్రొడక్షన్ కాస్ట్ రూ. 75 కోట్లు వరకు అవుతుందట. త్రివిక్రమ్ తాను అనుకున్న విధంగా లావిష్ గా ఈ సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడని,అందుకు ఇంత ఖర్చు అని టాక్.

పవన్ కళ్యాన్ కు లాభాల్లో 30 శాతం వాటా

పవన్ కళ్యాన్ కు లాభాల్లో 30 శాతం వాటా

ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు యావరేజ్ గా రూ. 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు రెమ్యూనరేషన్ కాకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ లో 30% వాటా తీసుకోవాలని డిసైడ్ అయినట్లు టాక్. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్లు నుండి 170 కోట్లు జరిగితే అందులో కనీసం 45 నుండి 50 కోట్ల వరకు పవన్ కళ్యాణ్ కు రెమ్యూనరేషన్ గా అందనుంది.

హీరోయిన్లు

హీరోయిన్లు

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్లాన్ చేసిన సినిమా ఏప్రిల్ 3 నుండి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మానియేల్ హీరోయిన్లు.

English summary
Pawan Kalyan and Trivikram decided that they should shoot six days a week and 12 hours a day for that to happen. If the movie manages to release in August, it will be the fastest completed film for both of them.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu