రిలియన్స్ నిర్మాతగా పవన్ చిత్రం నవంబర్ నుంచే...
హైదరాబాద్ : ప్రస్తుతం కెమెరామెన్ గంగతో రాంబాబు షూటింగ్ ఫినిష్ చేసుకుని రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం నవంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ కాంబినేషన్ చిత్రం నిర్మించటానికి ప్రోడ్యూసర్ బీవీయస్‌యన్ ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు. రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహించనున్నారు. ఈ మేరకు త్రివిక్రమ్ స్క్రిప్టు ఫైనల్ చేయించుకుని తుది మెరుగులు దిద్దటంలో బిజీగా ఉన్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో జల్సా సినిమా వచ్చి విజయవంతం అయ్యింది. తాజాగా మరో సినిమా తెరకెక్కనుంది. ఈ విషయమై త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియాకు కన్పర్మ్ చేసి చెప్పారు. ఆ సినిమా ఎలా ఉంటుందో ఆయన మాట్లాడుతూ...నువ్వు నాకు నచ్చావు తరహా మానవ సంభంధాలతో ఉంటుందన్నారు.అలాగే తెలుగు సంప్రదాయలు,మానవ భాంధవ్యాలు ప్రధానంగా ఇందులో కనిపించేలా కథను రెడీ చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న కెమెరామెన్ గంగతో రాంబాబు అనంతరం ఈ చిత్రం ప్రారంభం అవుతుంది.
ఇంకా టైటిల్ ఖరారు కాని ఈచిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం నవంబర్ లో మొదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీలైన్ ఇప్పటికే రెడీ అయింది. త్వరలో త్రివిక్రమ్ స్క్రిప్టు వర్కు మొదలు పెట్టనున్నాడని, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా దీన్ని ప్లాన్ చేస్తుననట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications











