»   » పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మూవీ శాటిలైట్ రైట్స్ బాంబ్

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మూవీ శాటిలైట్ రైట్స్ బాంబ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా రిలీజ్ ముందే సంచలనాలు నమోదు చేస్తోంది. సాధారణంగా పవర్ స్టార్ సినిమా అంటేనే హైప్ ఓ రేంజిలో ఉంటుంది. దానికి త్రివిక్రమ్ లాంటి దర్శకుడు తోడైతే బాక్సాఫీసు రికార్డ్స్ బద్దలవ్వాల్సిందే, శాటిలైట్ రైట్స్‌కు భారీగా డిమాండ్ రావాల్సిందే.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జెమినీ టీవీ వారు ఈ చిత్రం శాటిలైట్ రూ. 19.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కేవలం శాటిలైట్ రూపంలోనే ఈచిత్రానికి ఇంత భారీ రేటు రావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ డబ్బుతో ఓ మీడియం రేంజి తెలుగు సినిమా తీయొచ్చని చర్చించుకుంటున్నారు.

ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రీ రిలీజ్ బిజినెస్

మరో వైపు ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగబోతోంది. ఇప్పటికే అన్ని ఏరియాలకు ముందస్తుగానే భారీగా థియేట్రికల్ రైట్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రూ. 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంచనా.

Pawan Kalyan Serious on comedian in Thrivikram's Movie shoot
పవర్ స్టార్

పవర్ స్టార్

ఈ చిత్రంలో పవర్ స్టార్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

అంచనాలు భారీగానే

అంచనాలు భారీగానే

గతంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో జల్సా, అత్తారంటికి దారేది లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.

సంచనాలు ఖాయం

సంచనాలు ఖాయం

ఈ ఏడాది దీపావళికి రిలీజ్ అయ్యే ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద మరిన్ని సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.

English summary
Film Nagar source said that, Pawan Kalyan and Trivikram upcoming film's satellited rights fetched a whopping amount of Rs.19.5 crores. Gemini TV has reportedly acquired the rights spending such an exorbitant price.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu