»   »  త్రివిక్రమ్‌తో మూవీ డేట్ ఫిక్స్: పవన్ కళ్యాణ్ కెరీర్లో తొలిసారి ఇలా!

త్రివిక్రమ్‌తో మూవీ డేట్ ఫిక్స్: పవన్ కళ్యాణ్ కెరీర్లో తొలిసారి ఇలా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా వస్తోందనే విషయం ఖరారైంది కానీ.... అసలు ఎప్పుడు మొదలవుతుందోననే విషయం అయోమయంగా మారింది.

ఈ అయోమయానికి కారణం పవన్ కళ్యాణ్ ఓ వైపు కాటమరాయుడు సినిమా షూటింగులో బిజీగా ఉండటం, మరో వైపు తమిళ దర్శకుడు నేషన్ దర్శకత్వంలో ఎంఎంరత్నం నిర్మాతగా దసరాకు మరో సినిమా ప్రారంభించడం.

సాధారణంగా పవన్ కళ్యాణ్ ఒకేసారి రెండు సినిమాలు చేయడం ఇదే తొలిసారి. అయితే ఈ సారి అందరినీ ఆశ్చర్య పరుస్తూ మూడో కూడా ప్రారంభించబోతున్నారు. అంటే ఒకేసారి మూడు సినిమాలు ఆయన చేస్తున్నారు.

నవంబర్ 5న ప్రారంభం

నవంబర్ 5న ప్రారంభం

త్రివిక్రమ్ తో సినిమాని నవంబర్ 5వ తేదీన అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంబందించిన కథను త్రివిక్రమ్ ఇప్పటికే సిద్ధం చేసేశాడని, ఆ కథ నచ్చడంతో పవన్ కూడా సినిమాని త్వరగా మొదలుపెట్టేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

 యాక్షన్ కామెడీ

యాక్షన్ కామెడీ

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యాక్షన్ కామెడీ ఎంటర్టెనర్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

 టాప్ టెక్నీషియన్లు

టాప్ టెక్నీషియన్లు

ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్లు తీసుకునే ఆలోచనలో ఉన్నారని, బహుషా వారు బాలీవుడ్, లేదా కోలీవుడ్ నుండి ఎంపిక చేసే అవకాశం ఉందని టాక్.

 భారీగా బడ్జెట్ ఎందుకు?

భారీగా బడ్జెట్ ఎందుకు?

2018 తర్వాత పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అయిపోతారు. అందుకే పొలిటికల్ ఎంట్రీ ముందు తాను చేయబోయే సినిమా భారీగా ఉండాలని, తన కెరీర్లోనే ఓ పెద్ద బిగ్గెస్ట్ హిట్ సినిమా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట.

 రూ. 100 కోట్లు?

రూ. 100 కోట్లు?

త్రివిక్రమ్ ఈ సినిమాను డిపరెంటుగా ప్లాన్ చేస్తున్నారని, అందుకే రూ. 100 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని, పవన్ కళ్యాణ్ హీరో కాబట్టి రిస్క్ తక్కువగా ఉంటుందనే ఆలోచనలో ఈ సాహసం చేయడానికి సిద్దమయ్యారని అంటున్నారు.

 పలు రికార్డులు బద్దలు

పలు రికార్డులు బద్దలు

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో భారీ సినిమా వస్తే పలు టాలీవుడ్లో పలు రికార్డులు బద్దలవ్వడం ఖాయం అంటున్నారు.

English summary
We have already reported that Trivikram is going to be teaming up with Powerstar Pawan Kalyan once again. The latest update reveals that the film is on and will be launched on the 5th of November. S Radhakrishna will be producing this film which will be made on a huge budget.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu