twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాకు అంత స్థాయిలేదన్న పవన్-త్రివిక్రమ్: కె విశ్వనాథ్‌ సినిమాలతో త్వరలో డిస్క్!

    దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, కళా తపస్వి కె.విశ్వనాథ్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఇండియన్ సినీ రంగంలో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, కళా తపస్వి కె.విశ్వనాథ్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసారు.

    బుధవారం ఉదయమే కె.విశ్వనాథ్ నివాసానికి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ చేరుకున్నారు. ఇద్దరూ ఆయనకు పాదాభివందనం చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

    దాదా సాహెబ్ ఫాల్క్ అవార్డ్ విశ్వనాథ్ గారికి రావడం అందరికీ ఆనందం కలిగింది. ఇది తెలుగు వారికి, దక్షిణాది వారికి ఆనందం కలిగించే విషయం. ఆయన గురించి మాట్లాడే స్థాయి, అర్హత తనకు లేకపోయినప్పటికీ ఆనందాన్ని ఎలా చెప్పుకోవాలతో తెలియక ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసాను. మన సంస్కృతి, కళల గురించి నాకు బాగా తెలిసింది కె.విశ్వనాథ్ సినిమా వల్లే అన్నారు పవన్ కళ్యాణ్ అన్నారు.

    కె విశ్వనాథ్ సినిమాల్లో శంకరాభరణం, స్వయం కృషి, స్వాతిముత్యం, శుభలేఖ సినిమా చాలా ఇష్టం. ఆయన అన్నతో సినిమాలు చేసేప్పుడు నాకు ఇంకా యాక్టింగ్ కూడా రాదు. ఆయనతో సినిమాలు చేయాలనే ఆలోచన స్థాయి అపుడు తనకు లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.

    త్రివిక్రమ్ మాట్లాడుతూ... కెవిశ్వనాథ్ సినిమాలన్నీ గొప్ప చిత్రాలే. కళ్యాణ్ గారు ఆయనతో మాట్లాడుతున్నపుడు ఓ మాట అన్నారు. ఆయన సినిమాల్లోని 12 బెస్ట్ సినిమాలను ఒక డిస్క్ సెట్ గా తయారు చేసి లిమిటెడ్ ఎడిషన్ లాగా ప్రింట్ చేసి ఆయన పట్ల మాకున్న ఇష్టాన్ని, గౌరవాన్ని ప్రదర్శించాలని అనుకుంటున్నాం. ఈ సంవత్సరంలోనే ఈ డిస్క్ రిలీజ్ చేస్తాం. కొన్ని అవార్డులు కొంత మందికి ఇచ్చినపుడు అవార్డులకే గౌరవం వస్తుంది. కె.విశ్వనాథ్ గారికి అవార్డు వచ్చిన తర్వాత అవార్డుల మీద నమ్మకం మరింత పెరిగింది. ఆయన గురించి మాట్లాడేందుకు స్థాయిగానీ, అర్హతగానీ, వయసుగానీ ఏవీ మాకు లేవు...కేవలం అభిమానంతో ఇదంతా మాట్లాడుతున్నామని త్రివిక్రమ్ తెలిపారు.

    పవన్ త్రివిక్రమ్

    పవన్ త్రివిక్రమ్

    ఫాల్కే అవార్డు వచ్చిన సంగతి తెలిసినప్పటి కె.విశ్వనాథ్ నివాసానికిప్రముఖుల తాకిడి కొనసాగుతోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు ఆయనన్ను కలిసారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ ఆయన్ను కలిసారు.

    తెలుగు సినిమాకు గౌరవం

    తెలుగు సినిమాకు గౌరవం

    ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్. 2016లో ఆయన సినిమారంగంలో చేసిన కృషికిగాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నాడు.

    అలా మొదలు పెట్టి ఇలా...

    అలా మొదలు పెట్టి ఇలా...

    చెన్నై లోని ఒక స్టూడియోలో సాంకేతిక నిపుణుడిగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టి, ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయకుడిగా చేరాడు. అక్కినేని నాగేశ్వరరావు నాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారాడు. సిరిసిరిమువ్వ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది.

    తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి

    తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి

    విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది శంకరాభరణం. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి వంటిది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయ సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాడు. భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీసాడు. వాటిలో కొన్ని సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం మొదలైనవి.

    సామాజిక అంశాలు

    సామాజిక అంశాలు

    కుల వ్యవస్థ, వరకట్నం వంటి సామాజిక అంశాలను కూడా తీసుకుని విశ్వనాథ్ చిత్రాలు నిర్మించాడు. సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి.

    అప్పట్లోనే పద్మశ్రీ

    అప్పట్లోనే పద్మశ్రీ

    శంకరాభరణానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. స్వాతిముత్యం సినిమా 1986లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది. భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను విశ్వనాథ్ కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది.

    దర్శకుడిగా విశ్రాంతి

    దర్శకుడిగా విశ్రాంతి

    విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తన సినిమాలకు ఎక్కువగా కె.వి.మహదేవన్ నుగానీ, ఇళయరాజాను గానీ సంగీతదర్శకులుగా ఎంచుకునేవాడు. కొన్ని సినిమాలలో పండిత హరిప్రసాద్ చౌరాసియా, కేలూచరణ్ మహాపాత్ర, షరోన్ లోవెన్ వంటి ప్రముఖ కళాకారులతో కలిసి పనిచేసాడు. ప్రస్తుతం దర్శకత్వ బాధ్యతలను తగ్గించుకుని నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

    English summary
    Pawan and Trivikram met and congratulated K Viswanath. Pawan wished to the legendary director for winning Dadasaheb Phalke Award.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X