పవన్-త్రివిక్రమ్ మూవీ సెకండ్ షెడ్యూల్ డీటేల్స్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న 'సరదా'(తాత్కాలిక టైటిల్) చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని సెకండ్ షెడ్యూల్ లోకి అడుగుపెట్టబోతోంది. గత కొన్ని రోజులుగా పొల్లాచ్చిలో షూటింగ్ జరుగుతుండగా ఇటీవలే పూర్తయింది. ఈచిత్రం సెకండ్ షెడ్యల్ మార్చి 1 నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా చేస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన 'జల్సా' మూవీ మంచి కామెడీ పండించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కామెడీ ప్రధానంగా పంచ్ డైలాగులతో పూర్తి స్తాయి కమర్షియల్ వినోదాత్మక చిత్రంగా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. 'జల్సా' చిత్రానికి ఈ చిత్రం డబల్ డోస్‌లా ఉంటుందట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజం, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు సినిమాకు హైలెట్ కానున్నాయి.
దీని తర్వాత క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ న్యాయ శాస్త్రంలోని అంశాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాడట. మరో వైపు పవన్ కళ్యాణ్ తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ అయిన 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ప్రై.లి'పై ఓ వచిత్రమైన టైటిల్ రిజిస్టర్ చేయించారు. 'కో..బలి'(నరుకు..బలి) అనే టైటిల్ జనవరి నెలలో ఏఫీ ఫిల్మ్ ఛాంబర్లో పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్ హౌజ్ పేరిట రిజిస్టర్ అయింది.


Click it and Unblock the Notifications











