పవన్-త్రివిక్రమ్ ‘తుఫాన్’... జల్సాకు డబల్ డోస్
ఈ చిత్రానికి ప్రస్తుతం 'తుఫాన్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. అయితే ఈ విషయం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం తమిళనాడులోని పొల్లాచ్చిలో షూటింగుకు సిద్ధం అవుతోంది. షూటింగ్ శరవేగంగా జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ కాగా, సెకండ్ హీరోయిన్ గా ప్రణీత ఎంపికయింది. ఇప్పటికే పవన్, తివిక్రమ్ కలిసి విదేశాల్లో పర్యటించి సినిమాకు కావాల్సిన లొకేషన్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జల్సా తరహాలో ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజం, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు సినిమాకు హైలెట్ కానున్నాయి.
ఈ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాలు ఖరారయ్యాయంటూ ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ సినిమా తర్వాత పవన్ సంపత్ నంది దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని వినికిడి. పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది. అదే విధంగా ప్రముఖ రచయిత కోన వెంకట్ కూడా పవన్ కళ్యాణ్ కోసం కథ రెడీ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












