For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓవర్సీస్‌‌లో పవన్-త్రివిక్రమ్ మూవీ ఆల్ టైం రికార్డ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మళ్లీ రికార్డుల జాతర మొదలైంది. గబ్బర్ సింగ్ చిత్రంతో టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు నెలకొల్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్....త్రివిక్రమ్‌తో చేస్తున్న తన తాజా సినిమాతో మళ్లీ రికార్డుల పరంపర మొదలుపెట్టారు. తాజాగా ఈచిత్రం ఓవర్సీస్(విదేశీ) రైట్స్ గతంలో ఏ సినిమాకు లేని విధంగా రూ. 6.70 కోట్లుకు అమ్మడయినట్లు తెలుస్తోంది. ఇంత రేటు పలకడం ఆల్ టైమ్ రికార్డుగా ట్రైడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

    సినిమా వివరాల్లోకి వెళితే...ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 3 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేసారు. ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర పర్యవేక్షణలో ఈ ఖరీదైన సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా చేస్తున్నారు.

    ఈచిత్రంలో పవర్ స్టార్ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడని, అతని క్యారెక్టరైజేషన్ కూల్ గా, హాస్య భరితంగా ఉంటుందని అంటుందని ఫిల్మ్ నగర్ టాక్. త్వరలో పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. 'మిర్చి' చిత్రంలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించిన నదియా ఈ సినిమాలో సమంత తల్లి పాత్రలో నటించబోతోంది. అదే విధంగా బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ కూడా ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నారు.

    మరో వైపు టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం రియల్ ఎస్టేట్ దాదాగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 'అత్తారింటికి దారేది' అనే టైటిల్ వినిపిస్తున్నప్పటికీ అధికారికంగా ఈ విషయం ఖరారు కావాల్సి ఉంది.

    English summary
    Film Nagar source said that, Pawan kalyan-Trivikram movie overseas rights bought for 6.70cr. The movie directed by Trivikram Srinivas and Samantha in femake lead. The film will be produced by BVSN Prasad under Sri Venkateswara Cine Chitra banner. Popular music director Devi Sri Prasad will score the soundtrack for the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X